అన్వేషించండి

Rythu Bandhu Amount: రైతులకు గుడ్ న్యూస్, రైతు బంధు సాయం పంపిణీకి డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Rythu Bandhu in Telangana: తెలంగాణలో రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

Rythu Bandhu amount: హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు (Farmers in Telangana) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్‌లో రైతు బంధు సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం (శుక్రవారం) నవంబరు 24న అనుమతి ఇవ్వడం తెలిసిందే. నవంబరు 28లోగా రైతు బంధు ప్రక్రియ ముగించాలని స్పష్టం చేసింది. అయితే నవంబర్ 25, 26, 27 వరుస సెలవుదినాలు కావడంతో నవంబరు 28న రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. అన్నదాతల ఖాతాల్లో రూ.5 వేలు యాసంగి సీజన్ రైతు బంధు పెట్టుబడి సాయం మంగళవారం (నవంబర్ 28న) ఒక్కరోజే జమ చేయనున్నారని వ్యవసాయశాఖ కమిషనర్ తెలిపారు. అయితే ఈసీ ఆదేశాల మేరకు ఆరోజు సాయంత్రం 5 గంటల లోపే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం (Rythu Bandhu Money) జమ చేయాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో యాసంగి సీజన్ కోసం ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం జమ చేయాలి. మొత్తం రూ.7,700 కోట్లను ఆర్థికశాఖ ఒకేరోజు రైతుల ఖాతాల్లో వారి భూమి ఎకరానికి అయిదు వేల చొప్పున జమ చేస్తామని వ్యవసాయశాక కమిషనర్ తెలిపారు. నవంబర్ 28న ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

ఎన్నికల ప్రచార గడువు ముగిసే నవంబరు 28న సాయంత్రంలోపే పూర్తి చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి అనుగుణంగా శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు పనిచేయడం లేదు. నవంబరు 28న మంగళవారం పనిదినం కావడంతో ఎట్టకేలకు ఆ ఒక్కరోజులో రైతు బంధు సాయాన్ని అన్నదాతలకు అందించాలని ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. 
Also Read: Telangana Elections 2023 : రైతు బంధు నగదు జమ డౌటేనా ? - ఊహించని సమస్య !

కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపాలని ఫిర్యాదు చేసిందంటూ కొన్ని రోజుల కిందటి వరకు బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. మొదట ఎలక్షన్ కోడ్ కారణంగా ఈసీ సైతం అనుమతి ఇవ్వాలా వద్దా అని యోచించింది. అయితే గతంలోనూ ఇచ్చిన అనుమతి, నిబంధనల్ని పరిశీలించి రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆటంకాలు తొలగిపోయాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

2018 అక్టోబర్ 5న కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులు పూర్తిచేయాలని నిర్దేశించింది. రైతులకు ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా, ఖరీఫ్ సీజన్ రూ.5 వేలు పెట్టుబడి సాయం ఇదివరకే రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా యాసంగి సీజన్ సాయన్ని రూ.5 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయశాఖ కమిషనర్ తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget