అన్వేషించండి

Hyderabad News: మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి షాక్ - అల్లుడి కళాశాల భవనాలు కూల్చివేత

Telangana News: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన కళాశాల భవనాలను కూల్చివేశారు.

Revenue Officers Demolished Mla Marri Rajasekhar Reddy College Buildings: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Mallareddy) ఇటీవల షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భూమిని ఆక్రమించి రోడ్డు వేశారని ఆయనకి చెందిన కాలేజీ రోడ్డును తొలగించగా.. గురువారం ఆయన అల్లుడి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. హైదరాబాద్ (Hyderabad) శివారు దుండిగల్ లోని చిన్న దామరచెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో ఆయనకు చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూల్చేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. దీనిపై వారం క్రితమే ఆయా యాజమాన్యాలకు నోటీసులిచ్చారు. తాజాగా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. అయితే, దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి పోలీసులు సద్దిచెబుతున్నారు.

ఇటీవలే మల్లారెడ్డికి షాక్

కాగా, మల్లారెడ్డికి (Malla Reddy) ఇటీవలే అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ (HMDA) లే అవుట్ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణలపై కలెక్టర్ దృష్టి సారించారు. అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించగా.. ఆ రోడ్డును అధికారులు తొలగించారు. అయితే, అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంత మంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. హెచ్ఎండీఏ (HMDA) అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీకి రోడ్డు వేశామని స్పష్టం చేశారు. 2,500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడతారని అన్నారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని పేర్కొన్నారు.

కబ్జాలపై కలెక్టర్ ఆగ్రహం

మరోవైపు, చెరువు కబ్జాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపేట, నెక్నామ్ పూర్ లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్ లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తోన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు బిల్డర్స్ ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎకరం విస్తీర్ణంలో చెరువు స్థలంలో విల్లాల నిర్మాణాలను రెవెన్యూ శాఖ గుర్తించింది.

Also Read: MLC Kavitha: 'సీఎం అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు' - ఢిల్లీ లిక్కర్ కేసులో తాను బాధితురాలినేనన్న ఎమ్మెల్సీ కవిత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Embed widget