Revanth Reddy: హైడ్రాపై కక్ష గట్టిన కేటీఆర్ - హరీష్‌తోనే బీఆర్ఎస్‌కు ముప్పు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Jublihills Byelection: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో తనపై ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై రేవంత్ స్పందించారు. రాజకీయ, ప్రభుత్వ పరమైన అంశాలపై ప్రెస్‌మీట్‌లో తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.

Revanth Reddy fires on BJP BRS: జూబ్లిహిల్స్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రారం సాగుతున్న సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో బీఆరెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాంగ్రెస్, బీఆరెస్ అభివృద్ధిని పోల్చి చూసి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా ఇలా… అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ బీజం వేసిందిని..కానీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి విధ్వంసం చేశాయని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్‌లో విధ్వంసం
ఐటీఐఆర్ హైదరాబాద్ రాకుండా చేసింది బీఆరెస్, బీజేపీ కాదా అని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న ప్రణాళికలతోనే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని..వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ తీసుకురాలేదన్నారు. సచివాలయంలో ఆలయం కూల్చేస్తే కిషన్ రెడ్డి స్పందించలేదన్నారు. కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు గోదావరిపాలు చేశారని మండిపడ్డారు. ప్రగతి భవన్ కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడింది ..కొడుకు కోసం వాస్తు సరిద్దడానికి ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని.. సచివాలయం నిర్మిస్తే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఎవరికైనా పనికొచ్చిందా అని రేవంత్ ప్రశ్నించారు. పేద ప్రజలకు ఆ సచివాలయంతో ఏమైనా ప్రయోజనం ఒనగూరిందా చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకున్నారని.. సద్దాం హుస్సేన్ లా ప్రాణభయంతో తనను తాను కాపాడేందుకు ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లు కట్టుకున్నాడన్నారు. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని అప్పగించారని విమర్శించారు.
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంస్థలతోనే హైదరాబాద్‌కు గుర్తింపు
ఆనాడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే మనకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాయని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ను రద్దు చేయడం తప్ప వీళ్లు ఒక్క అదనపు ఎయిర్ పోర్టునైనా తేలేదన్నారు. పదేళ్లలో మెట్రోను ఒక కిలోమీటరైనా విస్తరించలేదు..నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణ ఎందుకుచేయలేదని ప్రశ్నించారు. పదేళ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్ ను ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్ముకున్నారని.. తాము తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటున్నామని తెలిపారు.
కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్శ్
హైదరాబాద్ నగర ప్రజల కోసం పరితపించిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారు ఇప్పుడు కిషన్ రెడ్డి, కేటీఆర్ ను బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారని రేవంత్ సెటైర్ వేశారు.మెట్రో, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు .మేం వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు లకు అనుమతులు తీసుకొచ్చాం ..మరిన్ని ఎయిర్ పోర్టులకు అనుమతులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ..డ్రై పోర్టు ఏర్పాటు కోసం గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు అనుమతులు తెచ్చుకున్నాం ..ఎలీ లిల్లీ లాంటి కంపెనీ 1 బిలియన్ డాలర్స్ ఫార్మాలో పెట్టుబడులు పెడుతోందన్నారు. రెండేళ్లలో ఒక ఏడాది ఎన్నిక కోడ్ తో అభివృద్ధి జరగలేని.. మిగిలిన ఏడాదిలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. తెలంగాణ ప్రజలకు ఉపయోగంలేని ప్రగతి భవన్, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్, సచివాలయం చూపించి ఇంకా ఎన్నాళ్ళు కాలం గడుపుతారని బీఆర్ఎస్ ను ప్రశఅనించారు.
హైడ్రా ఏం తప్పు చేసిందో చెప్పాలి !
నగరంలోని 695 చెరువులలో 44 చెరువులను బీఆరెస్ కబ్జా చేసిందvf. ఆక్రమించుకున్న చెరువులను విధించినందున హైడ్రా పై విషం చిమ్ముతున్నారని సీఎం ఆరోపించారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవరు బీఆరెస్ కాదా? సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకుంది నిజం కాదా చెప్పాలన్నారు. వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించి నగరంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా చేసింది హైడ్రానో కాదో చెప్పాలన్నారు. ఈగల్ ఫోర్స్, హైడ్రా పై కేటీఆర్ కక్ష పెట్టుకున్నాడు . హైడ్రా ఎక్కడ తప్పు చేసిందో చెప్పు నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని పిలుపునిచ్చారు.
హరీష్ రావుకు ఒక్క అడుగే మిగిలింది
హరీష్ రావుకి ఒక్క అడుగే మిగిలి ఉందని.. కేసీఆర్ కి ఆరోగ్యం బాగాలేదు. కేటీఆర్ కి తలకాయ బాగాలేదన్నారు. కేసీఆర్ కు అండగా నిలబడేవాళ్లని కబళించుకుంటూ వచ్చింది హరీషేనన్నారు. కేటీఆర్, కవిత కలిసి ఉంటే ఇబ్బంది అవుతుందని ఇద్దరి మధ్య గొడవ పెట్టాడన్నారు. కేసీఆర్ కుటుంబంతో ఉండే వాళ్ళందరినీ హరీష్ బీఆరెస్ నుంచి బయటకు పంపేశారు. బయట వాళ్ళందరికీ విజయవంతంగా బయటకు పంపాడు ఇప్పుడు ఇంట్లో కవితను కూడా బయటికి పంపేలా చేశారు. వీళ్లా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది అని రేవంత్ ప్రశ్నించారు. సర్వేలను తాను నమ్మనని..సారు కారు పదహారు అన్నారు ఏమైందని ప్రశ్నించారు. వందకు తక్కువ కాదన్నారు బొక్క బోర్లా పడ్డారు బ్యాండు మేళంను పిలుచుకుంటే మనకు నచ్చిన పాటనే కొడతారని రేవంత్ సెటైర్ వేశారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసన తెలిపే హక్కు ఇవ్వని వాళ్ళకి మద్దతిస్తారా? ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి ఓటేస్తారా? అని టీడీపీ కార్యకర్తలను రేవంత్ ప్రశ్నించారు.





















