అన్వేషించండి

Banakacharla Issue: గోదావరి-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాలి -కేంద్ర మంత్రికి రేవంత్ విజ్ఞప్తి

Telangana Banakacharla: బనకచర్ల ప్రాజెక్టు రిపోర్టులను తిరస్కరించాలని సీఆర్ పాటిల్‌కు రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ఏపీ ఇచ్చిన ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని కోరారు.

Telangana CM:  తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న  గోదావరి-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని  జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యంలో గోదావ‌రి జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్-1980 (జీడ‌బ్ల్యూడీటీ), ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం-2014ల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి వారు తెలియ‌జేశారు. ఢిల్లీలోని శ్ర‌మ‌శ‌క్తి భ‌వ‌న్‌లో జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌, ఆ శాఖ కార్య‌ద‌ర్శి దేబ‌శ్రీ ముఖ‌ర్జీ, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గురువారం స‌మావేశ‌మ‌య్యారు. 

బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు అనుమ‌తుల విష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ‌, ప‌ర్యావ‌ర‌ణ శాఖ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో తెలంగాణ ప్ర‌జ‌లు, రైతుల్లో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల ఆధారంగా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్ర‌తిపాదిస్తున్నామ‌ని  ఏపీ చెబుతోంద‌ని.. జీడ‌బ్ల్యూడీటీ-1980లో వ‌ర‌ద జ‌లాలు, మిగులు జ‌లాల ప్ర‌స్తావ‌నే లేద‌న్నారు. 2014 ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం  ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాల‌నుకుంటే ముందు ఆ న‌దీ యాజ‌మాన్య బోర్డు, కేంద్ర జ‌ల‌ సంఘం (సీడ‌బ్ల్యూసీ), జ‌ల్‌శ‌క్తి మంత్రి అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా  ఉండే  ఎపెక్స్  కౌన్సిల్‌లో చ‌ర్చించి అనుమ‌తి పొందాల‌ని.. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏపీ వీట‌న్నింటిని ఉల్లంఘిస్తోంద‌ని కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. 

బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో  ఏ నిబంధ‌న‌లు పాటించ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌ద  జ‌లాల ఆధారంగా ప్రాజెక్ట్ చేప‌డుతున్నామ‌ని చెబుతుండ‌డం తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని జ‌ల్ శ‌క్తి మంత్రితో సీఎం పేర్కొన్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకొని బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్ల‌కుండా చూడాల‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  సీడ‌బ్ల్యూసీ  ప‌రిధిలోని సాంకేతిక స‌ల‌హా మండ‌లి నుంచి అనుమ‌తులు పొంద‌కుండానే వ‌ర‌ద జ‌లాల పేరుతో  పోల‌వ‌రం కింద పురుషోత్త‌ప‌ట్నం, వెంక‌ట‌న‌గ‌రం, ప‌ట్టిసీమ‌, చింత‌లపూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను ఏపీ చేప‌ట్టింద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెలియ‌జేశారు.  జీడ‌బ్ల్యూడీటీ-1980 నిబంధ‌న‌ల ప్ర‌కారం పోల‌వ‌రం డిజైన్లు మార్పు చేసింద‌ని, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌కు విరుద్ధంగా ప‌నులు చేప‌డుతోంద‌ని.. తాము అభ్యంత‌రాలు లేవ‌నెత్తినా ప‌నులు మాత్రం కొన‌సాగిస్తూనే ఉంద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం వివ‌రించారు.  జాతీయ‌ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం విష‌యంలో ఎటువంటి నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 

1500 టీఎంసీల‌కు వాడుకునేలా  అనుమ‌తులు కావాలి ! 

తెలంగాణ‌కు గోదావ‌రి న‌దిలో 1000 టీఎంసీలు, కృష్ణా న‌దిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి  వినియోగానికి కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్‌వోసీ) జారీ చేయాల‌ని, దానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెల‌పాల‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్న‌ర ఎక‌రాల‌కు నీరు అందుతుంద‌ని.. ఆ త‌ర్వాత ఏపీ చేప్ట‌టే ప్రాజెక్టుల అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలిస్తే త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌న్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్రాజెక్టుల‌కు అనుమ‌తుల ప్ర‌క్రియ‌లో స‌త్వ‌రం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విష‌యంలో మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌డం త‌గ‌ద‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం  రేవంత్ రెడ్డి  అన్నారు. ఈ వైఖ‌రితో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప‌లు అపోహ‌లు, ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయ‌న్నారు. పాల‌మూరు-రంగారెడ్డి, స‌మ్మ‌క్క‌-సారక్క‌, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల‌కు నీటి కేటాయింపుల‌తో పాటు అన్ని ర‌కాల అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. 

 గంగా, య‌మునా న‌దుల ప్ర‌క్షాళ‌న‌కు నిధులిచ్చిన‌ట్లే మూసీ పున‌రుజ్జీవ‌నానికి నిధులు కేటాయించాల‌ని  కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో స‌మావేశం అనంత‌రం రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు.  సుదీర్ఘంగా  సాగిన స‌మావేశంలో త‌మ విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార‌ని వెల్ల‌డించారు. బ‌న‌క‌చ‌ర్ల‌కు సంబంధించిన డీపీఆర్ త‌మ‌కు అంద‌లేద‌ని కేంద్ర మంత్రి తెలిపార‌ని... త్వ‌ర‌లోనే ఎపెక్స్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Ayyappa swamy Temples : శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
Embed widget