అన్వేషించండి

Jubilee Hills Congress: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేసేది నేనే - రేసులోకి అజారుద్దీన్ !

Mohammad Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో తానే పోటీ చేస్తానని మహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు . తనకు టిక్కెట్ లేదని కొంత మంది ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jubilee Hills by election:  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోను, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి,  పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు  మహమ్మద్ అజారుద్దీన్ ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు.  తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని అన్నారు.         

జూబ్లిహిల్స్‌లో కష్టపడి పని చేస్తున్నాననంటున్న అజారుద్దీన్                     

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సగం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని అన్నారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.                         

గత పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ కు మెజార్టీ 

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గడిచిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని, గెలిచి రాహుల్ గాంధీ కి బహుమతిగా అందిస్తామని అన్నారు.                                

జూబ్లిహిల్స్ నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి             

నాంపల్లీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, ఇర్ఫాన్ అజీజ్,   ఫహీమ్ కురేషీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. మైనార్టీ ఎమ్మెల్యే కూడా లేరు. జూబ్లిహిల్స్ నుంచి మైనార్టీ నేతకే చాన్స్ ఇవ్వనున్నారు. ఈ సారి మజ్లిస్ మద్దతు కూడా లభించడం ఖాయం కావడంతో ఇక్కడ గెలిచే వారికి మంత్రి పదవి వస్తుందని భావిస్తుతన్నారు. అందుకే పోటీ మరింత తీవ్రంగా ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget