అన్వేషించండి

Medigadda News : కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ జరిపించడం లేదు - బీజేపీకి రేవంత్ రెడ్డి ప్రశ్న !

కాళేశ్వరం అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ చేయించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ తక్షణం మేడిగడ్డను పరిశీలించాలని డిమాండ్ చేశారు.


Medigadda News  :  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం అవినీతేనన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.  పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని..   రీడిజైన్ పేరుతో కేసీఆర్  ప్రాజెక్టుల స్వరూపం పూర్తిగా మార్చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు.  రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. 

కాళేశ్వరం మొత్తం లోపాలే 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్ ,డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మేనేజ్ మెంట్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.  మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదు, డిజైన్ ప్రకారం నిర్మాణం లేదు, నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదని ఆరోపించారు.  కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది.  మేడిగడ్డ కుంగింది... కేసీఆర్ పాపం పండిందన్నారు.  తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్... ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

అంచనాలు పెంచేసి దోపిడీ చేశారు 

ప్రాజెక్టు నిర్మాణానికి  రూ. 38,500 కోట్ల నుంచి రూ.1లక్ష 51 వేల కోట్లకు అంచనాలను పెంచిందని..  నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.  ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పై నోరు మెదపలేదన్నారు.  నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందని విమర్శించారు.  వేల కోట్లు నష్టం జరిగినా కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు అదేశించడంలేదని రేవంత్ బీజేపీని ప్రశ్నించారు.  బీఆరెస్ బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది.. అందుకే బీఆరెస్ ను బీజేపీ కాపాడుతోందన్నారు. 

ప్రాజెక్టు పరిస్థితిపై రాష్ట్రం ఎందుకు మాట్లాడటం లేదు? 

ప్రాజెక్టు పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివేదిక విడుదల చేయడంలేదు?.  ప్రాజెక్టులో లోపాలపై సీఎం ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు?సంబంధింత కంపెనీపై ఎందుకు విచారణకు ఆదేశించాలని చెప్పడంలేదు? అని ప్రశ్నించారు.  టెండర్లు 80 వేల కోట్లు చూపించి రేవైజ్డ్ ఎస్టిమేట్ లో 1లక్ష 51 వేల కోట్లకు పెంచారని..  ఇప్పటికే ప్రాజెక్టుపై 1లక్షా 2వేల కోట్లు ఖర్చు చేశారని రేవంత్  రెడ్డి తెలిపారు.  కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. అతని కుటుంబం ఆర్ధిక ఉగ్రవాద కుటుంబమన్నారు.  వీరిని తక్షణమే శిక్షించాలి...దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. 

కేంద్రం తక్షణం విచారణ చేపట్టాలి ! 

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇతర రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో ఒక కమిటీ వేయాలి...కేంద్ర ప్రభుత్వం, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ ఉండాలన్నారు.  సంపూర్ణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు.  సంబంధిత శాఖల మంత్రులైన హరీష్ రావు, కేసీఆర్ ను పదవుల నుంచి తొలగించాలని... కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ దీనిపై స్పందించాలన్నారు. 

అవినీతి కంపును మోదీ ఎలా భరిస్తున్నారు ?

ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు..కానీ ప్రాజెక్టులను పరిశీలించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  తక్షణమే మోదీ మెడిగడ్డను పరిశీలించి చర్యలు తీసుకోవాలి.. అవినీతి వాసన పడదంటున్న మోదీ ఈ కంపును ఎలా భరిస్తున్నారని ప్రశఅనించారు.  జరిగిన లోపాలపై విచారణ చేపట్టాలని ప్రతిపక్షంగా కేంద్రాన్ని మేం డిమాండ్ చేస్తున్నామని..  అధికారంలోకి వచ్చాక మేం ఏం చేస్తామనేది అప్పుడు చెబుతామన్నారు.  కోదండరాం ను తెలంగాణ వ్యతిరేకి అంటే.. తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని  హెచ్చరించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget