Republic Day 2024 LIVE: రాజ్యాంగం ఇచ్చిన శక్తితోనే పదేళ్ల నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు
Republic Day 2024 LIVE Updates: గణతంత్ర దిన వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.
LIVE
Background
హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం దేశ గణతంత్ర దిన వేడుకలను నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు నిన్ననే పూర్తి అయ్యాయి. గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు.
రిపబ్లిక్ వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రిపబ్లిక్ డే అంటే మనకి గుర్తొచ్చేది స్కూల్ యూనిఫామ్, రెడీ అవ్వడం, ఫ్లాగ్‌ని పట్టుకోవడం, ఫ్లాగ్ హోస్టింగ్, స్పీచ్. వయసు మారినా.. జనరేషన్ మారినా.. ఇవి మాత్రం కామన్‌గా జరుగుతుంటాయి. అయితే స్కూల్‌కి రెడీ అయి వెళ్లడం వరకు బాగానే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత స్పీచ్ చెప్పమంటే కాస్త భయంగానే ఉంటుంది. కేవలం స్టూడెంట్స్‌కే కాదు టీచర్లకు కూడా ఏమి స్పీచ్ ఇవ్వాలి? ఎలాంటి స్పీచ్ ఇవ్వాలని అంశంపై కాస్త భయం ఉంటుంది. అయితే మీరు ఎలాంటి భయం లేకుండా స్వీచ్ ఎలా ఇవ్వాలో ఇక్కడ ఉంది. మీరు చూసేయండి. రిపబ్లిక్ డే రోజు చెప్పేయండి.
రిపబ్లిక్ డే స్పీచ్ అంటే ఏదో ఫార్మాలటీగా ఇచ్చేది కాదు. టీచర్స్‌కి పిల్లలకు చెప్పేందుకు చాలా విషయాలు ఉంటాయి. కానీ స్టూడెంట్స్‌కి కాస్త తక్కువ అవగాహన ఉంటుంది. పైగా మంచి స్పీచ్ ఇచ్చిన స్టూడెంట్స్‌కి బహుమతులు ఇస్తారు కాబట్టి.. మీరు స్వీచ్ ఇచ్చేప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? దీని కోసం ఎవరు త్యాగం చేశారు వంటి విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి.
స్టూడెంట్స్ స్పీచ్ ఇవ్వాలంటే..
ముందుగా స్జేజ్ మీద ఉన్న పెద్దలందరికీ విష్ చేయాలి. తర్వాత స్టూడెంట్స్‌కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పాలి. 200 ఏళ్ల బ్రిటీష్ పాలను నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విధానం.. సార్వభౌమాధికార ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఎలా మారింది వంటి విషయాలు చెప్పాలి. జాతీయ గీతం, జాతీయ జెండా ప్రాముఖ్యతలు చెప్పవచ్చు. జాతీయ గీతం ఎవరు రాశారు? జాతీయ జెండాలో రంగులు దేనిని సూచిస్తాయి వంటి అంశాలు స్పీచ్‌ను ఇంట్రెస్టిగ్గా మారుస్తాయి. మనం జనవరి 26న ఎందుకు రిపబ్లిక్ డే చేసుకుంటాము? భారత రాజ్యాంగం ఆ రోజున ఉనికిలోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రాధాన్యతను చెప్పవచ్చు. ఈ అంశాలను మీరు స్పీచ్ ఇచ్చేప్పుడు లేదా వ్యాసాల పోటీల్లో పాల్గొనేప్పుడు ఫాలో అవ్వొచ్చు.
టీచర్స్ స్పీచ్ ఎలా ఉండాలంటే..
స్టూడెంట్స్‌కి తెలియని విషయాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలిగే నాల్డెజ్ ఉండాలి. ఉదాహరణకు రిపబ్లిక్ డే అంటే ఏమిటి అనగానే గణతంత్ర దినోత్సవం అని చెప్తారు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది. ఆ రోజు ఏమి జరిగింది వంటి విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించవచ్చు. రాజ్యంగా రాయడానికి ఎన్ని నెలలు పట్టింది? ఎంత ఖర్చు అయింది వంటి విషయాలు చెప్పవచ్చు. ఈ సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. మనకి స్వాతంత్ర్యం వచ్చిన ఎన్ని ఏళ్లకు రాజ్యాంగాన్ని పూర్తి చేయగలిగారు వంటి విషయాలు చెప్తే పిల్లలకు మంచిగా ఉంటుంది. వారికి కొన్ని ముఖ్యవిషయాల పట్ల అవగాహన పెరుగుతుంది.
Republic Day 2024 LIVE: రాజ్యాంగం ఇచ్చిన శక్తితోనే పదేళ్ల నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు
రాజ్యాంగం ద్వార ప్రజలకు చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు గవర్నర్. ఇలాంటి వాటిలో ఓటు హక్కు చాలా ముఖ్యమైందన్నారు. అలాంటి శక్తిమంతమైన ఓటుతో పదేళ్ల నియంత పాలనకు చరమగీతం పాడారు అన్నారు.
Republic Day 2024 LIVE: పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ప్రారంభం- జాతీయ జెండా ఆవిష్కరించి గవర్నర్
తెలంగాణలో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు గవర్నర్ తమిళిసై. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలు హాజరయ్యారు.