అన్వేషించండి

1st Warning For Munneru: మున్నేరుకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, వేగంగా పెరుగుతున్న నీటిమట్టం

Khammam Rains | తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. మున్నేరు నీటిమట్టం పెరుగుతుండటంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Red Alert has been issues to people living along with Munneru River | ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతోంది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మున్నేరుకు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12.30కి మున్నేరు వద్ద నీటిమట్టం 16.50 అడుగులకు చేరడంతో ఫస్ట్ వార్నింగ్ జారీ చేశారు. 16 అడుగులకు చేరితే తొలి హెచ్చరిక, ఒకవేళ 24 అడుగులకు నీటిమట్టం చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.

భారీ వర్షాలతో వేగంగా పెరిగిన మున్నేరు నీటిమట్టం..

మహబూబాబాద్, వరంగల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరులో నీటిమట్టం పెరుగుతోంది. దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తున్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు మంత్రి తుమ్మల, అధికారులు విజ్ఞప్తి చేశారు. భారీగా వరద నీరు చేరుతుంది, కనుక ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

రెస్క్యూ కేంద్రాలు ఇవే
స్వర్ణ భారతి 
చర్చి కాంపౌండ్ 
మహిళా డిగ్రీ కళాశాల 
రమణపేట ఉన్నత పాఠశాల 
దామసలాపురం పాఠశాల 
శనివారం సాయంత్రం వరకు మున్నేరులో నీటిమట్టం 6, 7 అడుగులు మాత్రమే. కానీ వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రాత్రి 8.30కి 9.50 అడుగులకు చేరింది. అంతకు గంట ముందు 8.4 అడుగలకు నీరు ఉండేది. శనివారం రాత్రి 10.40 గంటలకు నీటిమట్టం 12.80 అడుగులకు చేరింది. రాత్రి 11 గంటలకు మున్నేరు నీటిమట్టం 13.2 అడుగులకు పెరిగింది. 12 గంటలకు 15 అడుగులు ఆ తరువాత అరగంటకే తొలి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటిపోయింది. 

ఇటీవల వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వరద ప్రవాహం, మున్నేరు వాగులో ఫ్లో పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

Also Read: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా

Also Read: తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళాలు - పెద్ద మనసుతో ఎవరెవరు ఎంతిచ్చారంటే!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టులో మ్యాచ్ మనవైపు తిప్పేసిన స్పిన్నర్లు, పట్టు బిగించిన భారత్
ముంబై టెస్టులో మ్యాచ్ మనవైపు తిప్పేసిన స్పిన్నర్లు, పట్టు బిగించిన భారత్
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టులో మ్యాచ్ మనవైపు తిప్పేసిన స్పిన్నర్లు, పట్టు బిగించిన భారత్
ముంబై టెస్టులో మ్యాచ్ మనవైపు తిప్పేసిన స్పిన్నర్లు, పట్టు బిగించిన భారత్
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Kiran Abbavaram: చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Embed widget