Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్ దాఖలు
TRS Rajya Sabha Nominations: సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి రాజ్యసభ ఎన్నికలకు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు బుధవారం నాడు నామినేషన్ పత్రాలను ఈ నేతలు అందజేశారు. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి నామినేషన్లను దాఖలు చేశారు.
జూన్ 21తో ముగియనున్న పదవీకాలం
టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయగా, ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వచ్చే నెల 21తో తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గత మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
— TRS Party (@trspartyonline) May 25, 2022
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న దామోదర్‌రావు, ఫార్మా దిగ్గజం బండి పార్థసారధికి పలువురు టీఆర్ఎస్ నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించిన దామోదర్‌రావు, బండి పార్థసారథి రెడ్డిలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా ఈరోజు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. pic.twitter.com/oAB80GdmN9
— TRS Party (@trspartyonline) May 25, 2022
కేసీఆర్‌ను కలిసిన వద్దిరాజు రవిచంద్ర
రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా బుధవారం నాడు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.