By: ABP Desam | Updated at : 17 Dec 2022 12:43 PM (IST)
కలసిపోయిన సర్దార్, గంగుల
Karimnagar News : మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ ప్రస్తుత పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ కలిసి పోయారు. ఈ మధ్య జరిగిన జగిత్యాల జిల్లా బహిరంగ సభ తర్వాత రోజు రవీందర్ సింగ్ కూతురు వివాహానికి ప్రత్యేకంగా వచ్చారు సీఎం కేసీఆర్. అదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఆతిథ్యం స్వీకరించారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య తిరిగి సత్సంబంధానికి సీఎం ప్రతిపాదించినట్లు తెలిసింది. అసలే రానున్న రోజుల్లో బిజెపి నుండి పోటీ ఎక్కువ అవుతున్న తరుణంలో విభేదాలు మంచివి కావని పార్టీ నష్టపోయిన అధికారం చేజారిన పరిణామాలు అందరికీ ఇబ్బందికరంగా మారుతాయి అని సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రవీందర్ సింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టడమే కాకుండా తిరిగి వారిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరినట్లు తెలిసింది మొత్తానికి సర్దార్జీ మంత్రి జీ కలిసిపోయినట్లే ... అని ఇరు వర్గాల నేతలు ఆ పార్టీ కార్యకర్తలు సంబరపడుతున్నారు.
కొంత కాలంగా రవీందర్ సింగ్ కు, మంత్రి గంగుల కమలాకర్‌కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. రవీందర్ సింగ్ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. శాసన మండలిలో స్థానిక కోటా ఎన్నికల సమయంలో రవీందర్ సింగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం భానుప్రసాద్, ఎల్.రమణలకు అవకాశం ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆయనపై కోడ్ ఉల్లంఘన కేసులో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించారు. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ చేయించారని సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు.
కొద్ది రోజుల కిందట రవీందర్ సింగ్ అన్న కూతురు, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్ ఆడియో కలకలం రేపింది. డివిజన్ లో అభివృద్ధి పనులను మంత్రి కావాలనే ఆపేస్తున్నారని సోహన్ ఆరోపణలు చేశారు. దీంతో డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి మాజీ మేయర్ సహా, కార్పొరేటర్ కమల్జిత్కౌర్, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పడు ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. సర్దార్ రవీందర్ సింగ్‌కు రాష్ట్ర స్థాయి పదవిని కేసీఆర్ ఇచ్చారు. ఆయనను బీఆర్ఎస్ తరపున జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కరీంగనగర్ బాధ్యతలు గంగులకు.. జాతీయ స్థాయి పార్టీలో సర్దార్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారు.
రీంనగర్ మేయర్‌గా పనిచేసిన రవీందర్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ముద్రపడ్డారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధిక్కార స్వరం వినిపించి టీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రెండు దశాబ్దాలుగా ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని రవీందర్ సింగ్‌ను కేసీఆర్ మళ్లీ దగ్గరకు తీసుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ తరపున బీహార్ బాధ్యతలు ఇవ్వవొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Breaking News Live Telugu Updates: మంత్రిపై దుండగుల కాల్పులు, వెంటనే ఆస్పత్రికి తరలింపు
Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ
Junior NTR on Taraka Ratna: అన్న చికిత్సకు స్పందిస్తున్నారు, కానీ ఆ విషయం చెప్పలేం - ఎన్టీఆర్
Hyderabad e-Prix 2023: ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ - బుక్ మై షోలో టిక్కెట్లు
Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే
Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !