By: ABP Desam | Updated at : 09 Jan 2023 03:26 PM (IST)
ఒక రోజు తేడాతో తెలంగాణలో కేసీఆర్, మోదీ సభలు
KCR Vs Modi: తెలంగాణలో ఎన్నికల ఏడాది రాజకీయల హీట్ పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ..రాజకీయ పార్టీలు మాత్రం రెడీ అయిపోతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ మొదట తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టారు. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తెలంగాణలోనే పెట్టారు. గతంలో ఢిల్లీలో లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి.. కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి.. ఖమ్మంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు. 18వ తేదీన ఈ సభ జరగనుంది.
18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
పద్దెనిమిదో తేదీన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు భారీగా నిర్వహించడానికి బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నా.. పార్టీ పరంగా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నా కేసీఆర్ స్వాగతం చెప్పడం దాదాపుగా మార్చిపోయారు. ఈ సారి కూడా ఆయన స్వాగతం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు.
అదే రోజు ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి బీజేపీలో చేరే చాన్స్
ప్రస్తుతం తెలంగాణలో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసులు, విచారణలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది మరో వైపు ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సభ పెట్టే రోజున.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే ఒప్పించింది. అయన పద్దెనిమిదో తేదీన తన అనుచరగణంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మంమలో ఉన్న వర్గ పోరాటాల కారణంగా పార్టీ నేతల్ని కాపాడుకోవడం బీఆర్ఎస్‌కు ఓ సవాల్ గా మారింది. దీంతో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. పొంగులేటితో పాటు ఎవరూ బీజేపీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
19వ తేదీన మోదీ బహిరంగసభ
చేరికల విషయంలో ఫామ్ హౌస్ కేసు స్టింగ్ ఆపరేషన్ తర్వాత బీజేపీ కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తరవాత బీజేపీ మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తుందని.. చేరికలు పెరుగుతాయని బీజేపీ నేతలంటున్నారు. పొంగులేటితో ప్రారంభించి బలమైన అభ్యర్థులు లేని చోటల్లా.. కీలక నేతల్ని చేర్చుకునేందుకు ఆపరేషన్ ప్రారంభిస్తామంటున్నారు. తెలంగాణ రాజకీయాలు ముందు ముందు మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి షాక్‌లు ఇస్తున్న అనుచరులు! ఇంతకూ ఆయనతో వెళ్లేదెవరు?
Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం
తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలెర్ట్!
KCR Vs Tamilsai : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్‌పై కేసీఆర్ సైలెన్స్ ! తెలంగాణ రాజకీయాలు మారిపోయాయా ?
BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!