అన్వేషించండి

Singareni : సింగరేణిలో మూడు రోజుల పాటు ఉత్పత్తి బంద్ .. సంపూర్ణంగా కార్మికుల సమ్మె !

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల సమ్మె ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోనుంది.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.  మూడు రోజుల పాటు కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  మొత్తం 11 డిమాండ్లను యాజమాన్యం ముందు సింగరేణి కార్మికులు ఉంచారు. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో నాలుగు బ్లాక్‌లు సింగరేణి పరిధిలో ఉన్నాయి.  సమ్మెకు అన్ని కార్మిక సంఘాలూ మద్దతు తెలిపాయి.   

Also Read : యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయి...తీవ్రత పెరుగుతోంది ! హైదరాబాద్ రోడ్ టెర్రర్‌లో ఎన్నో తెలియని విషయాలు...

కేంద్రం ప్రైవేటీకరణ చేయాలనుకున్న నాలుగు బొగ్గు బ్లాకుల అన్వేషణ కోసం సింగరేణి రూ.  750 కోట్లు ఖర్చు చేసింది. నూతనంగా గుర్తించిన బొగ్గు బ్లాకులను తన పరిధిలోకి తీసుకువచ్చేలా కేంద్రం ఇటీవలే చట్టం చేసింది. ఫలితంగా సింగరేణి సంస్థకు నూతన గనుల అనుమతి లభించలేదు. ఈ క్రమంలోనే సింగరేణి యాజమాన్యం గుర్తించిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం స్వాధీనం చేసుకొని వేలం వేసేందుకు నిర్ణయించింది. ఈనెల 13న బొగ్గు బ్లాకులకు సంబంధించిన బిడ్డింగ్ ఉంది. 

Also Read : మెకానిక్‌ షెడ్డులో మూడు హత్యలు.. ఎవరి పని.. పోలీసులకు సవాల్‌గా మారిన మర్డర్స్

తక్షణం ఆ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు. అందుకే బిడ్డింగ్ కంటే ముందే సమ్మె చేసి కేంద్రానికి తమ నిరసన తెలపాలని నిర్ణయించారు. కార్మిక సంఘాలన్నీ ఇటీవల ఏకతాటిపైకా రాలేదు. కానీ ఈ సమ్మె విషయంలో అన్ని సంఘాలూ ఒకే మాట మీద ఉన్నాయి. 72 గంటల పాటు సింగరేణిలో ఉన్న 44 గనులు 19 ఓసీపీలు, 25 భూగర్భ కేంద్రాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. రోజుకు 2 లక్షల టన్నుల చొప్పున మూడు రోజుల్లో 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగనుంది. 

Also Read : బొగ్గు గనుల వేలం ఆపండి.. ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్‌

తొలి రోజు అన్ని గ‌నుల వ‌ద్ద నిర‌స‌న తెలిపిన కార్మిక సంఘాలు విధులు బ‌హిష్కరించాయి. సింగ‌రేణి ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద కార్మిక సంఘాల ఆధ్వ‌ర్యంలో కార్యాల‌యం ముట్ట‌డి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా సింగ‌రేణి ప్ర‌ధాన కార్యాల‌యంలోకి వెళ్లేందుకు వ‌చ్చిన ఉద్యోగుల‌ను అడ్డుకున్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వెన‌క్కు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా అన్ని సంఘాల నాయ‌కులు డిమాండ్ చేశారు.

Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget