అన్వేషించండి

Nizamabad: మెకానిక్‌ షెడ్డులో మూడు హత్యలు.. ఎవరి పని.. పోలీసులకు సవాల్‌గా మారిన మర్డర్స్

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు వ్యక్తుల హత్య. అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులు, రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్ స్కాడ్ తో ముమ్మర తనిఖీలు, హత్యల వెనుక కారణలను అన్వేషిస్తున్న పోలీసులు.

నిజామాబాద్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపింది. డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారికి అనుకొని ఉన్న హర్వెస్టర్ రిపేరింగ్ సెంటర్లో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మంచాలపై నిద్రిస్తున్న ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు కత్తితో దారుణంగా పొడిచి చంపారు.

డిచ్ పల్లి మండలం నాగపూర్ గేట్ వద్ద ఉన్న హార్వెస్టర్ షెడ్‌లో జరిగిన హత్యలు లోకల్‌గా సంచలనంగా మారింది. హత్యకు గురైన వారిలో ఇద్దరు పంజాబ్, ఒకరు నారాయణ ఖేడ్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. షెడ్డులోపల మంచంపై  33 ఏళ్ల మెకానిక్‌ హర్పాల్‌ సింగ్‌. మరో బెడ్‌పై అతడి బంధువు 45 ఏళ్ల జోగిందర్‌ సింగ్‌ డెడ్‌బాడీలు దుప్పట్లో చుట్టేసి ఉన్నాయి. బయట ఉన్న మంచంపై పాతికేళ్లు కూడా నిండని క్రేన్ డ్రైవర్‌ సునీల్ చనిపోయి ఉన్నాడు. నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్యకు గురైన ముగ్గురు హార్వెస్టర్ మెకానిక్‌లుగా పని చేస్తున్నారు. నిజామాబా సీపీ సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిచ్ పల్లి పోలీసులు క్లూస్ టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇతర ప్రాంతాలకు చెందిన వీరిని చంపాల్సిన అవసరం ఏంటి?. ఈ మధ్య కాలంలో వీరితో ఎవరైనా గొడవ పడ్డారా... ఎవరితోనైనా పాతకక్షలు ఉన్నాయా... ఈ హత్యల వెనుక అసలు కోణం ఏమై ఉంటుందన్న యాంగిల్‌లో పోలీసులు కూపీ లాగుతున్నారు. 

హత్యలు జరిగిన షెడ్డుకు సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి పనిచేయకపోవడం కేసు ముందుకు సాగ లేదు. అందుకే పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి కాస్త దూరంలో ఉన్న ద్విచక్రవాహనాల షోరూంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు ఓ చిన్న క్లూ దొరికింది. అర్థరాత్రి దాటిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అటుగా వెళ్తున్నట్టు గుర్తించారు పోలీసులు.

ఘటనా స్థలంలో మద్యం సీసాలు కూడా దొరికాయి. రాత్రి మందు పార్టీ జరిగిందా.. ఈ సందర్భంగా ఏమైనా గొడవ పడ్డారా అన్న యాంగిల్‌లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు తాగారో తేల్చే పని పడ్డారు. ఎవరైనా రెక్కీ చేసి ప్రణాళిక వేసుకొని హత మార్చి ఉంటారా అని అనుమానిస్తున్నారు.

జోగిందర్‌ సింగ్‌ మూడు రోజుల కిందట డిచ్‌పల్లి వచ్చాడు. ఇద్దరిదీ పంజాబ్‌ అయినందున వాళ్ల సొంతూరిలో ఏమైన గొడవలు జరిగాయా... పగబట్టి ఇక్కడకు వచ్చి  అతన్ని చంపారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సునీల్‌ కోసం వచ్చి ఉంటే..బయట నిద్రించిన అతడిని చంపి వెళ్లిపోయేవారు కదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.

ఘటనా స్థలంలో డబ్బులు, మృతుల జేబుల్లో డబ్బులు, సెల్‌ఫోన్లు లేకపోవడంతో దోపిడీ ముఠాల పని అనే అనుమానం వచ్చినా... వలస కూలీల వద్ద అంత డబ్బు ఉంటుందా అనే డౌట్ వస్తున్నాయి. ఏమైనా ఈ అనుమానాలతోనే కేసును ముందుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్టు ఈ కేసు విచారణలో కీలకమయ్యే ఛాన్స్ ఉంది. మృతుల ఫోన్ల కాల్‌డేటాను కూడా పోలీసులు తెప్పిస్తున్నారు. మూడు టీంలను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కేసు ఛేదించాలని చూస్తున్నారు పోలీసులు. 

హత్యకు గురైన వారందరి తలలపైనా దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధి డిచ్‌పల్లి మండలంలో మూడు నెలల్లో ఏడు హత్యలు జరిగాయి. అన్ని ఘటనల్లో నిందితులు చిక్కారు. ఇప్పుడు ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget