X
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
SL
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 16 - 24 Oct 2021, Sun up next
IND
vs
PAK
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

KCR Delhi : రెండు రోజుల్లో రెండు సార్లు అమిత్ షాతో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు ! తెలంగాణలో కీలక రాజకీయ మార్పులు ఖాయమేనా ?

కేసీఆర్ తనదైన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ ఢిల్లీలోనే ఉండి అమిత్ షాతో 2రోజుల్లో 2సార్లు భేటీ కావడం రాజకీయాల్లో కీలకమైన మార్పులు రానున్నాయన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.

FOLLOW US: 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తీరిక లేకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రెండు సార్లు సమావేశం అయ్యారు. రెండు సార్లు కూడా సుదీర్ఘంగా సమావేశం కావడం తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.  మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో  పాల్గొనేందుకు కేసీఆర్ రెండు రోజుల ముందుగానే ఢిల్లీ వెళ్లారు. ఆదివారం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షానే అధ్యక్షత వహించారు. సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ అమిత్ షా నివాసానికి వెళ్లారు. గంటన్నర పాటు చర్చలు జరిపారు. 

Also Read : ఏం సంబంధం ఉందని వైఎస్ఆర్‌సీపీ కోసం శక్తికి మించి పని చేశా ! జగన్ నిరాదరణపై కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు !

సోమవారం కూడా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ ఉదయం కొంత మంది కేంద్రమంత్రుల్ని కలిసినా మళ్లీ మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు. మరోసారి గంటన్నర పాటు చర్చలు జరిపారు. చర్చల ఎజెండా ఏమిటో స్పష్టత లేదు కానీ ఇలా రోజు మార్చి రోజు అమిత్ షాతో సమావేశం అయి చర్చించారంటే ఏదో అత్యంత కీలకమైన విషయమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పరంగా తెలంగాణ అంశాలు చర్చించారన్న విషయాన్నీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా కేసీఆర్ ఇలాంటి భేటీలు నిర్వహించారంటే ఏదో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంటుంది. ఇప్పుడు రెండు సార్లు భేటీ అయినా గత వారమే ఆయన ఢిల్లీ పర్యటనలో చర్చలు జరిపారు. ఇలా వరుస భేటీలు రాజకీయమేనన్న చర్చ ప్రారంభమైంది. 

Also Read : నేటి చీఫ్ సెక్రటరీలు రేపటి సలహాదారులు ! ఏ సేవలకు ఈ ప్రతిఫలాలు ?

కేసీఆర్ ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో అమల్లో పెట్టే వరకూ బయటకు తెలియనివ్వరని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. అమిత్ షాతో అలా గంటల తరబడి చర్చలు జరుపుతున్నారంటే.. రాజకీయంగా అత్యంత క్లిష్టమైన విషయంపైనేనని వినిపిస్తోంది. అదేమిటో అటు బీజేపీ వైపు నుంచి కానీ ఇటు టీఆర్ఎస్ వైపు నుంచి కాని స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ పరమైన విషయాలు ఇలా మాట్లాడే అవకాశం లేదని అంటున్నారు.  

Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?

తెలంగాణలో వరదల పరిస్థితి తీవ్రంగా ఉంది. ఓ వైపు  వరదల పరిస్థితిని సీఎస్ సోమేష్ కుమార్‌తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో వైపు కేంద్రమంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారంటే త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న వాదన ప్రారంభమైంది. 

Also Read : స్వరూపానంద వ్యతిరేకత ! ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: telangana politics Amit Shah kcr Telangana CM BJP VS TRS kcr meet amit shah

సంబంధిత కథనాలు

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..

Revanth Reddy: డీజీపీ ఫోన్ ట్యాపింగ్ అవుతోంది.. కరీంనగర్ లో రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Revanth Reddy: డీజీపీ ఫోన్ ట్యాపింగ్ అవుతోంది.. కరీంనగర్ లో రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్తున్నారా? మీకోసం ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.. చూడండి

Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్తున్నారా? మీకోసం ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.. చూడండి

Gold-Silver Price: పసిడి మరింత పైపైకి, అదే దారిలో వెండి కూడా.. మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: పసిడి మరింత పైపైకి, అదే దారిలో వెండి కూడా.. మీ నగరంలో ధరలివీ..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Mann Ki Baat: భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం: మోదీ

Mann Ki Baat: భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం: మోదీ