BC Bramhin Corporation : స్వరూపానంద వ్యతిరేకత ! ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ?
బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ కిందకు తేవడంపై సీఎం జగన్ ఎక్కువగా విశ్వసించే శారదాపీఠం స్వరూపానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందా అన్న చర్చ ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో వివాదాస్పదమైన అంశం బీసీ సంక్షేమ శాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను కలపడం. బీసీ అనే విభాగానికి బ్రాహ్మణ సంక్షేమం అనే వాదానికి మధ్య పొంతన వినడానికే పొంతన ఉండదు. అలాంటిది ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్నది చాలా మంది ఆశ్చర్యపోయిన విషయం. బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నారని కొందరు.. బీసీల కోసం కేటాయించిన నిధులు ఆ కార్పొరేషన్‌కు కేటాయిస్తారని మరికొందరు వాదించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్‌లో కొత్త పరిణామం.
Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సమర్థిస్తూ ఉంటారు స్వరూపానంద. ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నా ముందుగా దేవాదాయ మంత్రి వెల్లంపల్లిశ్రీనివాస్ స్వరూపానంద వద్దకు వెళ్లి సలహాలు తీసుకుంటారు. స్వరూపానంద చాతుర్మాస దీక్షల కోసం కొన్నాళ్లు హిమాలయాల్లో ఉంటారు. ఈ మధ్యలో ఏమైనా సలహాల కోసం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి ఇతరులు రిషికేష్ వెళ్లి వస్తూంటారు. అలా వెళ్లినప్పుడు కూడా ఈ అంశం గురించి చర్చించలేదేమో కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ విషయంలో ఆయన సలహాలను తీసుకోలేదని తాజా ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వెల్లడయింది.
Also Read : 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్
స్వరూపానంద ఇటీవలే శారదాపీఠానికి తరిగి వచ్చారు. కొంత మంది అర్చక జేఏసీ నేతలు ఆయనను కలిశారు. బీసీ సంక్షేమ లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను విలీనం చేయడంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకుని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాదు.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో అందరికీ తెలియచేశారు. జగన్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమర్థించడమే కానీ స్వరూపానంద ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మొదటి సారి నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందేమో అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read : "బ్రాండ్ న్యూ కేబినెట్"కు ముహుర్తం ఖరారైందా ? సీనియర్లను జగన్ ఎలా డీల్ చేస్తారు ?
అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ సంక్షేమ శాఖ కిందకు తీసుకు రావడానికి ప్రధానమైన కారణం ఉంది. అదే నిధుల కేటాయింపు. ప్రభుత్వం కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు. కానీ పథకాలకు ఇస్తున్న డబ్బులను ఆయా వర్గాల ఖాతాలో వేస్తోంది. ఉదాహరణ అమ్మ ఒడి కింద పథకం నిధులు తీసుకుంటున్న బ్రాహ్మణులకు వారికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సాయం అందిస్తున్నామని చెప్పడానికి ముందుగా నిధులను కార్పొరేషన్ ఖాతాలో వేస్తారు. ఆ తర్వాత అమ్మఒడికి మళ్లిస్తారు. అలా చేయాలంటే దేవాదాశాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చిక్కులు వస్తున్నాయి. దేవాదాయశాఖ నిధులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి బీసీ సంక్షేమ పరిధిలోకి తెచ్చారు. కానీ బ్రాహ్మణ సంఘాలు.. అర్చకులు మాత్రం దీనిపై సంతృప్తిగా లేరు.
Watch Video : కాలగర్భంలోకి ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్..!