Traffic Challan Telangana: పెండింగ్ చలానా ఉంటే పోలీసులు మన బండి సీజ్ చేయొచ్చా? హైకోర్టు క్లారిటీ

వాహనాలపై ఎన్ని పెండింగ్ చలానాలు ఉన్నా సరే.. వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

FOLLOW US: 

రోడ్డు నిబంధనలు మీరినందుకు మీ వాహనంపై చలానా పడిందా? అది చెల్లించకుండా అంతే రోడ్డుపైకి వస్తే వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందంటూ ఇటీవల విపరీతమైన ప్రచారం జరిగింది. ఓ లాయర్‌కు చెందిన బైక్‌ను ట్రాఫిక్ పోలీసు సీజ్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త పాకిపోయింది. పెండింగ్ చలానాలు ఉండి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసుకు పట్టుబడితే ఇక బండి సీజ్ చేయొచ్చని, అందుకే ఆ పోలీస్ జప్తు చేశాడని వీడియో వైరల్ అయింది. దీంతో పెండింగ్‌ చలానాలున్న వాహనదారులు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్క పెండింగ్‌ చలానా ఉన్నా వాహనం జప్తు చేయొచ్చని ఓ ట్రాఫిక్‌ అధికారి చెప్పినట్లుగా వీడియో బయటికి రావడంతో భయం మరింత పెరిగింది. అయితే, దీనిపై తెలంగాణ హైకోర్టు ఇటీవల క్లారిటీ ఇచ్చింది. దీంతో వాహనాలను సీజ్ చేసే అంశంపై స్పష్టత వచ్చినట్లయింది.

Also Read: Warangal News: వరంగల్‌లో కన్నింగ్ లేడీ, యువకుడి ఆత్మహత్య.. ముగ్గులోకి దింపి కిలాడీ ప్లాన్, అవాక్కైన పోలీసులు

వాహనాలపై ఎన్ని పెండింగ్ చలానాలు ఉన్నా సరే.. వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు పోలీసుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి బండిని పోలీసులు సీజ్ చేయగా.. అది సరికాదంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఏదైనా వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ స్పష్టం చేసింది.

Also Read: Medak Murder: ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు.. ఆమె పాత్రపై పోలీసుల ఆరా..

ఆ ఘటనతో అందరిలోనూ ఆందోళన
కూకట్‌పల్లి కోర్టులో లాయర్‌గా ఉన్న వ్యక్తి ఆగస్టు 1న బైకుపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై రూ.1635 చలానా పెండింగ్‌ ఉండడం వల్ల వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఆ పెండింగ్ చలానా అప్పుడే చెల్లించాలని కోరగా.. వాహనదారుడు అందుకు ఒప్పుకోకపోవడంతో సీజ్ చేశారు. ఒక్క చలానాకే సీజ్‌ చేస్తారా అంటూ న్యాయవాది ప్రశ్నించారు. అయితే, తాము నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బాధితుడు న్యాయవాది కావడంతో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగస్టు 11న ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం పెండింగ్ చలానాల నెపంతో వాహనాలను సీజ్‌ చేయకూడదని పేర్కొంది. వాహనం తిరిగివ్వాలని కోర్టు ఆదేశించడంతో ఆ వాహనాన్ని తిరిగి ఇచ్చేశారు. హైకోర్టు తాజాగా ఇచ్చిన మార్గదర్శకాలతో వాహనదారులకు ఊరట కలిగినట్లయింది.

Also Read: Suresh Gopi: నన్ను ‘ఆవు పేడ’ అని అంటున్నందుకు గర్వంగా ఉంది.. నటుడు, ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్

Also Read: Wedding Viral Video's: బుల్లెట్ బండి డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా.. ఇక ఈ పెళ్లి వైరల్ వీడియోలు చూసి నవ్వేసుకోండి

Published at : 21 Aug 2021 09:30 AM (IST) Tags: Hyderabad police Telangana High Court police vehicles seize pending challans hyderabad traffic police

సంబంధిత కథనాలు

Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ

Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ

KTR TODAY : సద్గురు " సేవ్ సాయిల్" ఉద్యమానికి కేటీఆర్ సపోర్ట్ - దావోస్‌లో కీలక చర్చలు !

KTR TODAY : సద్గురు

Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త

Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త

Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్‌ ఏమన్నారంటే?

Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్‌ ఏమన్నారంటే?

Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?

Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!