అన్వేషించండి

PM Modi: 'తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ధ్వంసం చేశాయి' - రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేసిందన్న ప్రధాని మోదీ

Telangana News: బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు పార్టీల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారని చెప్పారు.

PM Modi Comments in Nagar Kurnool Meeting: గత పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. నాగర్ కర్నూల్ (Nagar Kurnool)లో నిర్వహించిన బీజేపీ (Bjp) బహిరంగ సభలో శనివారం ఆయన మాట్లాడారు. 'బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ వంతు వచ్చినట్లుగా భావిస్తోంది. మల్కాజిగిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను. కాంగ్రెస్, బీజేపీ రెండూ అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. 7 దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవడం మినహా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. గరీబీ హఠావో నినాదం వారు ఇచ్చినా.. పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అంటారు. గత పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. 140 కోట్ల మంది భారతీయలు నా కుటుంబం. 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధి పొందారు. ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు రాబోతున్నాయి. తెలంగాణలోనూ వేగవంతమైన అభివృద్ధిని తీసుకురావాలి. కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాల వారికి ఎంతో మేలు జరిగింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి.' అని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది బీజేపీయేనని ప్రధాని మోదీ అన్నారు. 'బీజేపీని గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. మీ అభివృద్ధి కోసం రాత్రి, పగలూ పని చేస్తాను. మా పార్టీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపిస్తే కాంగ్రెస్ ఆటలు ఇక సాగవు. కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు వచ్చింది. నేను నిరంతరం ప్రజల కోసమే పని చేస్తున్నా. ఆర్టికల్ 370, అయోధ్య రామాలయ నిర్మాణం వంటివి కొన్ని ఉదాహరణలు.' అని పేర్కొన్నారు.

'ప్రజలు తీర్పు ఇచ్చేశారు'

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే దేశ ప్రజలు తీర్పు ఇచ్చేశారని.. మూడోసారి ప్రధాని మోదీయేనని నిర్ణయించారని అన్నారు. 'మల్కాజిగిరిలో శుక్రవారం జన ప్రవాహాన్ని చూశాను. యువకులు, మహిళలు, వృద్ధులు ఇలా చాలా మంది రోడ్లపై నిల్చుని బీజేపీకి మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రజల వ్యతిరేకతను చూశాను. మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత పదేళ్లలో కేంద్ర పథకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా అవినీతి, అబద్ధాల బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ వారు గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓడించాలని చూశారు. తెలంగాణలో ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అవమానించారు. ఇక్కడ ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు ఢిల్లీలో తెలుస్తుంది. ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వండి.' అని మోదీ పిలుపునిచ్చారు.

Also Read: Kavtiha: 'నన్ను ఈ కేసులో కావాలనే ఇరికించారు' - న్యాయ పోరాటం చేస్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

టాప్ హెడ్ లైన్స్

LPG e-KYC: ఎల్పీజీ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఈ-కేవైసీ చేయకపోతే అక్టోబర్ 1 నుంచి బుకింగ్స్ బంద్!
ఎల్పీజీ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఈ-కేవైసీ చేయకపోతే అక్టోబర్ 1 నుంచి బుకింగ్స్ బంద్!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
Chiranjeevi: థియేటర్ బిజినెస్‌లో మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ఏర్పాటుకు రెడీ
థియేటర్ బిజినెస్‌లో మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ఏర్పాటుకు రెడీ
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
South Coast Railway: కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Team India Selection Controversy:  ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
Embed widget