అన్వేషించండి

PM Modi Live BJP Meeting in Hyderabad: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీతో యువత జీవితాలు నాశనం: ప్రధాని మోదీ

PM Modi Meeting In LB Stadium: బీజేపీ కూడా ప్రచారంలో దూకుడు పెంచేందుకు రెడీ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో మాట్లాడనున్నారు. 

Key Events
PM Modi Live in Hyderabad PM Modi To Address Backward Classes Meet In Hyderabad Telangana Today PM Modi Live BJP Meeting in Hyderabad: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీతో యువత జీవితాలు నాశనం: ప్రధాని మోదీ
హైదరాబాద్ లో బీజేపీ బీసీ గర్జన సభ

Background

PM Modi BJP Meeting in Hyderabad: హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. హమీలు, మ్యానిఫెస్టోలు, భరోసా, గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గులాబీ పార్టీతో పాటు కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ (BJP) కూడా ప్రచారంలో దూకుడు పెంచేందుకు రెడీ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో మాట్లాడనున్నారు. 

బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారా ?

సాయంత్రం 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోడీ ప్రకటిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా హామీలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీలు చెబుతున్నాయి. బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇరకాటంలోకి నెట్టాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో బాగంగానే బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

బీసీల ఓట్లే లక్ష్యమా ?
ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ కాషాయ పార్టీలో ఎన్నడూ లేదు. తెలంగాణ జనాభాలో 54శాతం ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని, అందుకే బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. బీసీ ఎజెండా ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశము లేకపోలేదంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామని హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. తెలంగాణలో విజయం సాధించి, దక్షిణాదిన సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.

గంటన్నర పాటు నగరంలో పర్యటన 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ పర్యటించనున్న ప్రాంతాల్లో పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రోడ్లను ఇప్పటికే జల్లెడ పట్టేశారు. ఎల్బీ స్టేడియం పోలీసులు భారీగా మోహరించారు. 

18:56 PM (IST)  •  07 Nov 2023

టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీతో యువత జీవితాలు నాశనం చేసింది బీఆర్ఎస్: ప్రధాని మోదీ

బీఆర్ఎస్ నేతలకు అహంకారం, వారి అవినీతిని కక్కిస్తామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో టెన్త్ పేపర్ లీకేజీ, టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షల పేపర్లు సైతం లీకయ్యాయని, అందుకు బీఆర్ఎస్ చేతకానితనమే కారణమంటూ మండిపడ్డారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. అహంకారం ఉన్నవారికి ప్రజలు ఓట్లు వేయరని, కానీ బీఆర్ఎస్ నేతల్లోనూ అలాంటి అహంకారం కనిపిస్తుందన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఈసారి ఇంటికి పంపడం ఖాయమని, బీఆర్ఎస్ ఓటమి తథ్యమన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అలాంటి అహంకార సీఎంకు మీ ఓటుతో జవాబు ఇచ్చారు. ఇక్కడి నేతలు మోదీని తిడుతూ ఉంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేరు వేరు కాదు. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు అని ప్రజలు గుర్తించాలన్నారు. 

18:51 PM (IST)  •  07 Nov 2023

దళితులను లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి చేసింది మేమే: ప్రధాని మోదీ

దళితులు, పీడితులు, ఆదివాసీలకు ఎప్పుడూ బీజేపీ అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించి బీసీ గర్జన సభకు మోదీతో పాటు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ‘‘అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వం సమయంలో మేమే ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశాం. జీఎంసీ బాలయోగిని బీజేపీ తొలి దళిత లోక్ సభ స్పీకర్ ను చేసిందని గుర్తు చేశారు. అలాగే తొలి దళిత రాష్ట్రపతిగా కూడా రామ్ నాథ్ కోవింద్‌ను చేసిందని, అలాగే ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి తొలి ఆదివాసీ వ్యక్తిని దేశాధినేత చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నారు. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు ప్రధాని మోదీ.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget