Drunk And Drive: ఊదమంటే ఊదేశావ్.. కానీ ఎందుకయ్యా.. ఇలా పేరు తప్పుగా చెప్పి మరో తప్పు చేశావ్
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేసేప్పుడు.. వింత వింత వ్యక్తులు పోలీసులకు తగులుతుంటారు. అలా జూబ్లీహిల్స్ పోలీసుల దగ్గర ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తోపాటు మరో తప్పు చేసి ఇంకో కేసు మీద వేసుకున్నాడు.
మద్యం తాగితే.. ఏదేదో చేస్తుంటారు మందుబాబులు. ఒక్కొసారి వాళ్లు చేసేది.. వాళ్లకే కాదు.. పక్క వాళ్లకి అర్థం కాదు. మద్యం మత్తులో ఉంటే అంతేగా మరి. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేప్పుడు పోలీసుల దగ్గర ఒక్కో వ్యక్తి.. ఒక్కోలా ప్రవర్తిస్తాడు. కొంతమంది తమకు ఇతను తెలుసు.. అతను తెలుసంటూ.. ఏదో తప్పించుకోవాలని చెప్పి బుక్కవుతూ ఉంటారు. అలానే ఓ వ్యక్తి.. తన పేరు తప్పుగా చెప్పి బుక్ అయిపోయాడు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36, పిల్లర్ నంబరు 1658 వద్ద ఈనెల 7న నారాయణగూడ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎస్సై మల్లయ్య ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి.. అటుగా వచ్చాడు. కారును నిలిపి అతడికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేశారు. మద్యం మోతాదు శాతం.. 49 ఎంజీగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ క్రమంలో అతడి.. వివరాలు అడిగారు పోలీసుల. తన పేరును దోమలగూడకు చెందిన నారల లలిత వరప్రసాద్‌గా తెలియజేశాడు. పోలీసులు మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సమన్లు జారీ చేసే క్రమంలో అతని పేరు లలిత వరప్రసాద్ కాదని తెలిసింది. అంతేకాకుండా అతడు మైనరుగా గుర్తించారు. ఈ మేరకు ఎస్సై మల్లయ్య.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గతంలో అనలైజర్ ఎత్తుకెళ్లిన వ్యక్తి
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందుబాబులు.. చేసే పనులు మామూలు ఉండవు కదా. పోలీసులకే పరీక్ష పెడతారు. అయితే ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తునే ఉంటాం. గతంలో బ్రీత్ అనలైజర్ మెషిన్ ని పోలీసుల చేతిలోనుంచి లాక్కొని పారిపోయారు. కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ సమీపంలో కొన్ని రోజుల కిందట రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. సరిగ్గా 11.45 సమయంలో మియాపూర్ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులను బైకుపై వచ్చారు. వారిని పోలీసులు ఆపారు. అందరిలాగానే.. టెస్ట్ కు సహకరిస్తారని.. అనుకున్నారు పోలీసులు.. కానీ జరిగింది వేరే. హోంగార్డు బ్రీత్ అనలైజర్ టెస్టు చేస్తుండగా.. ఓ మందు బాబు నోటికి దగ్గరగా పెట్టిన బ్రీత్ ఎనలైజర్‌ను లాక్కొని క్షణాల్లోనే మాయమయ్యాడు. పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆ మందు బాబు అస్సలు దొరకలేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు ఆకతాయిలను పట్టుకునే పనిలో పడ్డారు.
Also Read: ఇదేం పనయ్యా బాబు.. బ్రీత్ అనలైజర్ ఉన్నది ఊదడానికి.. ఇలా పోలీసుల దగ్గర నుంచి ఎత్తుకెళ్లడానికా?
Also Read: Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాల సీజ్.... పోలీసు శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు