అన్వేషించండి

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ

Pawan Kalyan Deputy CM Letter Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలకమైన లేఖ రాశారు. పోక్సో చట్టం కఠినతరం, నేరస్థులపై రౌడీ షీట్లు, నిర్ణీత గడువులో దర్యాప్తుపై కీలక సూచనలు చేశారు.

Janasena Telangana POCSO Act Suggesstions: పోక్సో   చట్టం అమలును మరింత పటిష్టం చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ఒక కీలక లేఖ రాశారు. బాలల భద్రత, గౌరవం,  భయం లేని జీవన హక్కు రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

నేరస్తులు బాధితులను, వారి కుటుంబాలను బెదిరించే ధోరణి పెరుగుతోందని పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఒక పోక్సో నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి, బాధితురాలితో పాటు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, బాధితులకు రక్షణ కల్పించే పటిష్టమైన యంత్రాంగం రాష్ట్రంలో అవసరమని ఆయన స్పష్టం చేశారు.

పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయడానికి పలు కీలక సూచనలను ఆయన ఈ లేఖలో పొందుపరిచారు. దర్యాప్తు అధికారులకు బాలల పట్ల సున్నితమైన వైఖరి, ఫోరెన్సిక్ , డిజిటల్ సాక్ష్యాల సేకరణలో ప్రత్యేక శిక్షణ ఉండాలన్నారు.  బాధితుల వైద్య పరీక్షలు 24 గంటల్లోపు జరగాలి .  సాక్ష్యాల సేకరణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. పోక్సో కేసుల దర్యాప్తు ,  ఛార్జిషీట్ దాఖలు నిర్ణీత కాలవ్యవధిలో 60-90 రోజుల్లో పూర్తి కావాలన్నారు.  నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి సమగ్రమైన నివేదికలు సమర్పించాలి, అలాగే బాధితులకు రక్షణ కల్పించే 'విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్' ఉండాలని సూచించారు.  నేర చరిత్ర ఉన్న నిందితులపై రౌడీ షీట్లు తెరిచి, వారిపై నిరంతరం నిఘా ఉంచాలనిసూచించారు.  

ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమగ్రమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేయాలని, జిల్లా , రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ సెల్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పాఠశాలలు, వసతి గృహాలు, మరియు పూజా స్థలాల్లో పనిచేసే వారిపై ఆరోపణలు వస్తే, నిబంధనల ప్రకారం వెంటనే పోలీసులకు నివేదించేలా ప్రోటోకాల్ ఉండాలని ఆయన సూచించారు.  పోక్సో కేసులను సాధారణ పరిపాలనా వ్యవహారాలుగా చూడకూడదని, ప్రతి ఫిర్యాదుపై అత్యంత సున్నితంగా,  త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. తన సూచనల అమలుపై తీసుకున్న చర్యలను 30 రోజుల్లోపు నివేదిక రూపంలో తెలియజేయాలని కోరుతూ, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.                

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget