X

YS Sharmila : పూర్తి కాని "వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ" రిజిస్ట్రేషన్.. పేరు మార్చుకోవాలని ఈసీ లేఖలు !

షర్మిల రాజకీయ పార్టీకి కొత్త చిక్కులు వస్తున్నాయి. పార్టీ పేరుపై అభ్యంతరాలు రావడంతో ఈసీ రిజిస్ట్రేషన్ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 

వైఎస్ఆర్ తెలంగాణపార్టీని ప్రకటించిన షర్మిలకు ఇప్పుడు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ పేరు పై అభ్యంతరాలు వ్యక్తమయినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. వైఎస్ఆర్ అనే పేరు ఉపయోగించుకునే అంశంపై అన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని అందుకే పేరును  రిజిస్ట్రేషన్ చేయలేదని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇతర పేర్లు ప్రతిపాదించాలని సూచించామని ఈసీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. 
Also Read: తెలంగాణలో జీవో 317 మంటలు ! ఆ జీవోలో ఏముంది ? ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ?     

ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కార్యక్రమాలను సైతం మొదలుపెట్టారు. షర్మిల పార్టీ పేరుపై అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈసీకి లేఖ పంపారు. తన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు. దీనికి ఈసీ నుంచి వైయస్ షర్మిల పార్టీని రిజిష్టర్ చేయలేదని..  మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని షర్మిలకు లేఖ కూడా రాసినట్లు ఎన్నికల సంఘం సమాచారం పంపింది. 

Also Read: రాఘవ కేసులో పోలీసులపై ఒత్తిడి? రౌడీషీట్‌ ఓపెన్ చేయకుండా ఆడ్డుకుంటుందెవరు?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్‌సీపీ పేరు తమ పార్టీ పేరును పోలి  ఉందంటూ,ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి,సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ప్రస్తుతం ఈకేసు విచారణలో ఉంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. షార్ట్ కట్‌లో వైఎస్ఆర్‌సీపీ అని పిలుస్తున్నారు. అయితే తన పార్టీ అన్న వైఎస్ఆర్‌ను పోలి ఉందని.. తన పార్టీ పేరును వాడుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: ఆ బదిలీల జీవో వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది ! నిజామాబాద్ జిల్లాలో రోడ్డున పడ్డ పంచాయతీ కార్యదర్శలు...

షర్మిలకు కు వైయస్సార్ పేరుతోనే పార్టీ కావాలంటే  మహబూబ్ బాషా తో రాజీ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే వైఎస్ఆర్ పేరు లేకుండా వేరే పేరు పెట్టుకోవాల్సి రావొచ్చు.  తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ పేరుతో భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మహబూబ్ బాషా చెబుతున్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు ఇంకా స్పందించలేదు.  

Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: YS Sharmila sharmila ysrtp telangana Election Commission "YSR Telangana Party" Anna YSR Party

సంబంధిత కథనాలు

Breaking News Live: ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల హతం

Breaking News Live: ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల హతం

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా