News
News
X

కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి మోక్షమెప్పుడు?

25 ఎకరాల ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒక్కచోట ఉండేలా కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ప్రారంభాన్ని మాత్రం మరిచిపోయారు..

FOLLOW US: 

ప్రజల సమస్యల పరిష్కారం, పాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త సమీకృత కలెక్టరేట్లను నిర్మించింది. నిజామాబాద్ నగరంలోని బైపార్ రోడ్డులో ఇప్పటికే నూతన కలెక్టరేట్ భవనం పూర్తయి రెండేళ్లు గడుస్తోంది. కలెక్టరేట్‌ ప్రారంభానికి మాత్రం అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పక్క జిల్లా కామారెడ్డిలో నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగినప్పటికీ నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి నోచుకోవడంలేదు.

ప్రస్తుత కలెక్టరేట్‌ భవనం చాలా పాతది. దీంతో దుబ్బ బైపాస్‌ రోడ్డులో విశాలమైన నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని 25 ఎకరాల ప్రాంగణంలో 33 ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా నిర్మించారు. ప్రతి అంతస్తులో సెమినార్‌ హాల్స్‌, ఆడిటోరియం, వీడియో కాన్ఫరెన్స్‌హాల్స్‌, ఇలా అన్ని వసతులు ఉండేలా 2011 అక్టోబరు 11న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.62 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఆర్‌ అండ్‌ బీ శాఖ పూర్తి చేసింది. 2021 ప్రారంభంలో భవన నిర్మాణం పూర్తికాగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడంలేదు. వర్షాల వల్ల ఇప్పుడున్న కలెక్టరేట్ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. 

భవనం పూర్తై రెండేళ్లు గడుస్తున్నా

కలెక్టరేట్‌ భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 25 ఎకరాల ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒక్కచోట ఉండేలా భవనాన్ని నిర్మించారు. సమస్యల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది. అన్నీ ఉన్న కొత్త భవనం ప్రారంభానికి నోచుకోకపోవడంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుత కలెక్టరేట్‌ భవనం దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినది. ఇక్కడ ప్రగతిభవన్‌, పౌర సరఫరాల కార్యాలయం, పౌరసరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్యాలయాలు కార్పొరేషన్‌ కార్యాలయాలు, ఎన్‌ఐసీ, డీఆర్‌డీఏ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ చాంబర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్‌లు ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన పాత భవనంలో కొనసాగుతున్నాయి. పక్కన ఉన్న అక్షర ప్రణాళిక భవన్‌లో డీఆర్‌డీఏ, సీపీవో, వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ, మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమశాఖలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని పాత భవనంలో వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ పక్కన ఉన్న భవనంలో అదనపు కలెక్టర్‌ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రగతిభవన్‌ పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని శాఖల కార్యాలయాలలో పైకప్పులు పెచ్చులూడి లీకేజీలు కావడంతో అన్ని ముఖ్యమైన ఫైళ్లు వర్షానికి తడిసిపోయాయి. కార్యాలయ సిబ్బంది భయం భయంగా తమ విధులను నిర్వహించే పరిస్థితి ఉంది.

కలెక్టర్ కార్యాలయ మెట్ల వద్ద పెచ్చులూడి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రగతిభవన్‌పై మొత్తం పిచ్చిమొక్కలు పెరిగి భవనం శిథిలావస్థకు చేరుకుంది. కలెక్టర్‌ చాంబర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ చాంబర్‌ ఉన్న పాత భవనం సైతం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

నిరుపయోగంగా కొత్త భవనం

నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఊరి చివరన రెండేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో పూర్తిగా అది పాత భవనంలా మారింది. ఇప్పటికే భవనంలో ఫర్నిచర్‌, విద్యుత్‌ పరికరాలు, ఇతరత్ర విలువైన వస్తువులు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో అవన్ని పాడై కోట్ల రూపాయలు వృథా అయ్యే అవకాశం ఉంది. ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి నిర్మాణం పూర్తయిన ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు సీఎం కేసీఆర్ ఇదిగో వస్తారు అదిగో వస్తారు.. కలెక్టరేట్ ప్రారంభిస్తారు అని చాలా సార్లు అధికారులు హడావుడి చేసినప్పటికీ... సీఎం రాలేదు. కలెక్టరేట్ ప్రారంభం కాలేదు. పూర్తయిన భవనాన్ని ఎందుకు ప్రారంభించటం లేదు అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

రాజకీయ కారణాల వల్లే కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభం కావటం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయ్. కొన్ని శాఖలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయ్. ఆయా శాఖలు అద్దె భవనాల్లో కొనసాగటం వల్ల అద్దె బిల్లులు కూడా భారీగా పేరుకుపోయాయ్. ఇప్పటికైనా కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారభించాలని కోరుతున్నారు ఇటు అధికారులు అటు ప్రజలు. 

Published at : 09 Aug 2022 10:00 PM (IST) Tags: nizamabad Nizamabad news Nizamabad Latest News Nizamabad Updates

సంబంధిత కథనాలు

Eatala Rajender: మంత్రుల మాటలు కేసీఆర్ కేర్ చెయ్యలేదు, అందుకే ఈ సమస్యలు - ఈటల రాజేందర్

Eatala Rajender: మంత్రుల మాటలు కేసీఆర్ కేర్ చెయ్యలేదు, అందుకే ఈ సమస్యలు - ఈటల రాజేందర్

Singareni Employees Bonus: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ద‌స‌రా కానుక‌ ప్రకటన

Singareni Employees Bonus: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ద‌స‌రా కానుక‌ ప్రకటన

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై మాజీ మంత్రి ఆవేదన- సీఎం జగన్‌కు లేఖ

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై మాజీ మంత్రి ఆవేదన- సీఎం జగన్‌కు లేఖ

Nizamabad News:బాన్సువాడ నుంచి పోటీపై స్పీకర్ పోచారం క్లారిటీ

Nizamabad News:బాన్సువాడ నుంచి పోటీపై స్పీకర్ పోచారం క్లారిటీ

Adilabad Crime: బాలికపై లైంగికదాడి కేసులో సంచలన తీర్పు, 20 ఏళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు

Adilabad Crime: బాలికపై లైంగికదాడి కేసులో సంచలన తీర్పు, 20 ఏళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు

టాప్ స్టోరీస్

గుడివాడలో కొడాలి నానిని ఓడించేది ఎవరు?

గుడివాడలో కొడాలి నానిని ఓడించేది ఎవరు?

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!