అన్వేషించండి

Morning Headlines: హైడ్రా సైలెంట్ గా లేదన్న కమిషనర్, తమిళ రాజకీయాల్లో భారీ మార్పులు - మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Top 10 News Today: 
 
1. చంద్రబాబుతో లులు గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ
సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. కాగా లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సీఎం ‘‘ఎక్స్‌’’లో పోస్టు చేశారు. విశాఖలో మాల్‌, మల్టీప్లెక్స్‌, హైపర్‌ మార్కెట్‌ ఏర్పాటు, విజయవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్‌ల నిర్మాణంపై చర్చించారు. లులు ప్రతినిధులకు పూర్తి స్థాయిలో మద్దతిస్తామని చంద్రబాబు అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
2. జగన్ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి: సీఎం
వైసీపీ వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు.. నేతలకు సూచించారు. ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తున్నాడని.. ప్రభుత్వం-పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పి కొట్టాలన్నారు. అలాగే స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు   ప్రకటించారు. swarnandhra.ap.gov.in/suggestions ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరారు..పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
3. రాజ్యసభ ఎంపీగా నాగబాబు..?
వైసీపీకి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘం త్వరలో ఈ స్థానాలకు ఉపఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ మూడు రాజ్యసభ స్థానాలను కూటమి ఎవరికి కేటాయిస్దుందన్న దానిపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు పేర్లు ఖరారయ్యాయని.. ఒక స్థానం జనసేనకు ఇస్తారని చెబుతున్నారు. టీడీపీ తరపున గల్లా జయదేవ్, అశోక్ గజపతిరాజు, జనసేన నుంచి నాగబాబుకు సీట్లు దక్కే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
4. ‘జగన్‌ను దేశ బహిష్కరణ చేయాలి‘
తిరుమల పర్యటన రద్దులో భాగంగా ఇదేం దేశమంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దేశం గురించి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు అని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశ సాంప్రదాయాలను కించపరుస్తున్న జగన్ దేశంలో ఎందుకు ఉండాలని, జగన్‌ను దేశ బహిష్కరణ చేయాలని అన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
5. లడ్డూ కల్తీపై మొదలైన సిట్ విచారణ
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించింది. తిరుపతి చేరుకున్న సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని బృందం.. టీటీడీ మార్కెటింగ్ అధికారులను విచారించింది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదును సిట్ పరిశీలించింది. టీటీడీ ఈవో శ్యామలరావుతోనూ ప్రత్యేక దర్యాప్తు బృందం భేటీ కానుంది. నేటి నుంచి మూడు రోజులపాటు సిట్ తిరుమలలోనే మకాం వేసి విచారణ జరపనుంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
6. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులపై సీఎం రేవంత్‌ సమీక్ష
ఫ్యామిలీ డిజిటల్ కార్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులపై సమీక్ష నిర్వహించిన రేవంత్.. మహిళ పేరు మీదే ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. డిజిటల్‌ కార్డులో రేషన్‌, హెల్త్‌, ఇతర పథకాల వివరాలన్నీ ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రేష‌న్, రాజీవ్ ఆరోగ్యశ్రీ‌, ఐటీ, వ్యవ‌సాయ‌, ఇత‌ర ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధర‌ణ చేయాల‌న్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
7.కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
తాము కూల్చిన ఏ భవనానికి కూడా ఎలాంటి అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఆయన.. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనక ఉన్నారని రంగనాథ్ అన్నారు. అమీన్ పూర్‌లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
8. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి 
తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి   ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎంగా  నియమితులయ్యారు.  ఈ రోజు  మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నైలోని రాజ్‌భవన్‌లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
9. హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మృతి
హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ శుక్రవారం భీకర స్థాయిలో దాడులు చేసింది. దక్షిణ లెబనాన్‌ దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్‌ ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా మరణించినట్లు ఐడీఎఫ్ తాజాగా ధ్రువీకరించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేసింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
10. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటన 
బంగ్లాదేశ్‌తో జరగనున్న IDFC FIRST బ్యాంక్ మూడు టీ20ల  సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ఆటగాళ్ల టీంను సెలక్షన్ కమిటీ శనివారం రాత్రి ఎంపిక చేసింది. అక్టోబర్ 6న ఆదివారం నాడు ప్రారంభం కానున్న ఈ సీరీస్ లో తొలి మ్యాచ్  గ్వాలియర్ వేదికగాను, రెండవ మ్యాచ్  అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా ను, 3 వ మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగాను జరగనుంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Mahindra Scorpio: స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
Embed widget