Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
Team India squad for against Bangladesh | టెస్ట్ సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 6న
Team India squad for T20I series against Bangladesh | న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న IDFC FIRST బ్యాంక్ మూడు టీ20ల సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ఆటగాళ్ల టీంను సెలక్షన్ కమిటీ శనివారం రాత్రి ఎంపిక చేసింది. గ్వాలియర్, న్యూఢిల్లీ, హైదరాబాద్‌లలో మూడు టీ20లు ఆడనుంది. టెస్టు సిరీస్ పూర్తయిన తర్వాత టీమిండియా, బంగ్లాదేశ్ టీ20 సిరీస్ లో తలపడనున్నాయి.
బంగ్లాదేశ్‌తో 3 టీ20ల కోసం భారత జట్టు (15): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా.
అక్టోబర్ 6న ఆదివారం నాడు బంగ్లాదేశ్, భారత్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా రెండో టీ20, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12న చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ టీ20 సిరీస్ షెడ్యూల్, వేదిక, భారత ఆటగాళ్ల వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు.
NEWS 🚨 - #TeamIndia’s squad for T20I series against Bangladesh announced.
— BCCI (@BCCI) September 28, 2024
More details here - https://t.co/7OJdTgkU5q #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/DOyz5XGMs5