Dragon Movie - NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో లో రాబోతున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్లే. ఈ సినిమా షూటింగ్ 2025 జనవరి నుంచి ప్రారంభం కానుంది.
నెట్ ఫ్లిక్స్ లో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. థియేటర్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీ సినిమా ‘వార్ 2’ చిత్రీకరణలో బిజీ అయిపోయారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘వార్ 2’ లో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే సినిమా పై ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు ఆ రేంజ్ లో ఉంటాయి మరి. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఏ హీరో తో సినిమా చేస్తారు? ప్రభాస్ తో ‘సలార్ 2’ తీస్తారా? లేక ఎన్టీఆర్ తో కొత్త సినిమా మొదలు పెడతారా? ఈ సందేహాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ సినిమా షూటింగ్ 2025 జనవరి నుంచి ప్రారంభం కానుంది.
డ్రాగన్... టైటిల్ కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే!
ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీరా’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నారని దర్శకుడు సూరి వెల్లడించారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అదీ కన్ ఫర్మ్ అయింది. సంక్రాంతి సందర్భంగా ‘డ్రాగన్’ టైటిల్ ను ప్రకటించి, వెంటనే షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
ప్రముఖ దర్శకుడు శంకర్ తన హీరో, హీరోయిన్స్ వేరే ఏ సినిమా లోనూ నటించకూడదని కండిషన్ పెట్టేవారట. ఆ ట్రెండ్ ను ఇప్పటికీ దర్శకుడు రాజమౌళి కొనసాగిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కూడా అదే పంథాలో నడవడానికి రెడీ అయిపోయారు.‘సప్త సాగరాలు దాటి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ రుక్మిణీ వసంత్ ‘డ్రాగన్’ లో హీరోయిన్ ఎంపికయ్యారు. ఇప్పటికే పలు కన్నడ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు రుక్మిణీ వసంత్. వాటి చిత్రీకరణలను త్వరగా పూర్తి చేసి, ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ లో పాల్గోననున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేంతవరకూ ఏ సినిమా ఒప్పుకోకూడదని కండిషన్ పెట్టిందంట చిత్ర యూనిట్.
Also Read:ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?
ముంబై లో హోరాహోరీ
‘వార్ 2’ సినిమా కోసం ‘వీనమ్’, ‘ఎవెంజర్స్’ సిరీస్ లలోని చిత్రాలకు పని చేసిన వారిని యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను రంగంలోకి దించింది యశ్ రాజ్ ఫిల్మ్స్. ముంబైలో క్లయిమాక్స్ చిత్రీకరణ కోసం సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. దీని కోసం భారీ సెట్ ను రూపొందించే పనిలో ఉన్నారు నిర్మాత ఆదిత్య చోప్రా. వచ్చే నెలలో 15 రోజుల పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక, జనవరి లో మొదలయ్యే ‘డ్రాగన్’ తో పాటు ‘వార్ 2’ చిత్రం మిగిలిన పనులను కూడా పూర్తి చేయనున్నారు ఎన్టీఆర్. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బసూర్ ‘డ్రాగన్’ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తారు. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ‘డ్రాగన్’ తర్వాతే ప్రభాస్ ‘సలార్ 2’ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Also Read: తెలుగు ఓటీటీలోకి టోవినో థామస్ 'నారదన్'... మలయాళంలో విడుదలైన రెండేళ్లకు