అన్వేషించండి

Morning Top News: తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం, ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Todays Top 10 News:

1. నేడే లాటరీ.. లిక్కర్ లక్ ఎవరికో?
 
ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం నేడు లాటరీ తీస్తున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన షాపుల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తున్నారు. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 2.  ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
3. జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం షాపు నిర్వాహకులు తనకు 35 % కమీషన్ ఇవ్వాలని హుకూం జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే పేకాట, జూద కేంద్రాల నుంచి 15 % కమీషన్, మరో 20 %పెట్టుబడి వాటాగా ఇవ్వాలన్నారు. ఈ డబ్బును తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్నారు. నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు ఊరు విడిచి పోవాల్సిందేనని బహిరంగంగా హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
4. మోసం చేశారంటూ రాపాక ఆవేదన
పార్టీ కోసం కష్టపడిన తనను వైసీపీ అవమానించిందని.. రాజోలులో ఎంత కష్టపడి పనిచేసినా టిక్కెట్ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్పష్టం చేశారు. ఇష్టం లేకపోయినా.. ఓడిపోతానని తెలిసినా పెద్దల సలహా మేరకు ఎంపీగా పోటీ చేశానని చెప్పారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాపాక... తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తికి టికెట్ ఇచ్చి అవమానించారని అన్నారు. త్వరలో మరో పార్టీలో చేరుతానని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
5. బార్ ఎండ్ రెస్టారెంట్ గా మారిన జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసు
జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసులో దసరా దావత్ ఘనంగా జరుపుకున్నారు ఫారెస్ట్ అధికారులు. పండుగ సంబరాల్లో భాగంగా ఏకంగా ఫారెస్ట్ కార్యాలయంలోనే మద్యం,  మాంసంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పార్టీ చేసుకున్నారు.  జగిత్యాల జిల్లాలోని సామిల్ డిపో యజమానులు దావత్ ఇచ్చినట్టు సమాచారం. బార్ ఎండ్ రెస్టారెంట్ గా  జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసు   వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
6. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య
గన్‌తో కాల్చుకుని AR హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న జి. శ్రీనివాస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
7. అత్తా కోడళ్ల అత్యాచార ఘటనలో మైనర్లు..!
శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హిందూపురం త్యాగరాజ్ కాలనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా గుర్తించారు. వారిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల్లో మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
8. 80 వేల ఏళ్ల తర్వాత ఆకాశంలో మహాద్భుతం
 ఆకాశంలో మహా అద్భుతం ఆవిష్కృతమైంది. ఖగోళంలో ఓ అరుదైన తోకచుక్క దర్శనమిచ్చింది. తోకచుక్కలు కనిపించడం మామూలే అయినా.. దాదాపు 80 వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు చూసిన 'కామెట్ సి 2023 ఏ3'గా పిలిచే తోకచుక్క మళ్లీ దర్శనమిచ్చింది. దీనిని శుచిన్‌షాన్ - అట్లాస్ పేరుతో పిలుస్తున్నారు. తిరుపతికి చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డాక్టర్ అవినాశ్ ముక్కామల ఈ తోకచుక్క ఫొటోలు సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
9. ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం
 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న  రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై మరో  హత్యాప్రయత్నం జరిగింది.  వేదికకు కొంత దూరంలో భీకర దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి చిక్కారు. అతడి నుంచి బుల్లెట్లుతో లోడ్ చేసిన తుపాకీ, ప్రెస్‌కు సంబంధించిన నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
10. ఇజ్రాయెల్ పై ఇరాన్ మహాభారత యుద్ధ వ్యూహం..?
ఇజ్రాయెల్ ను ఒంటరి చేసి చావు దెబ్బ కొట్టేందుకు ఇరాన్ మహాభారత యుద్ధ తంత్రాన్ని వినియోగిస్తోంది. అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ ను చుట్టుముట్టి వేరే వారి వారి సాయం అందకుండా ఒంటరిచేసే చక్రవ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇజ్రాయెల్ పై దాదాపు ఎనిమిది సరిహద్దుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ముస్లిం దేశాలన్నీ తమకు మద్దతు ఇవ్వాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు ఆలోచించుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఇరాక్, యెమెన్, లెబనాన్, గాజా నుంచి నిరంతరం దాడులు చేస్తోంది. ఇలాంటి టైంలో ఆ దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికే ఇజ్రాయెల్‌కు టైం సరిపోతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
9. కీలక మ్యాచ్‌లో ఓడిన భారత్
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. 152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకు పరిమితమైంది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (54*), దీప్తి శర్మ (29), షఫాలీ వర్మ (20) రాణించారు. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Andhra Pradesh: పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
Weather Today: ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
Arthamainda ArunKumar Season 2 : 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

80 వేల ఏళ్లకి ఒకసారి కనిపించే తోకచుక్క, తిరుపతిలో అద్భుత దృశ్యంBaba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samson

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Andhra Pradesh: పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
Weather Today: ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
Arthamainda ArunKumar Season 2 : 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
US Elections 2024: ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు 
ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు 
Cardio vs Weights : జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే
జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే
Diwali Gifts: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా కార్లు, బైకులు - జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి
ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా కార్లు, బైకులు - జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి
SpaceX : అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త విప్లవం- నింగి నుంచి లాంచ్‌ప్యాడ్‌కు చేరుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్‌ 
అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త విప్లవం- నింగి నుంచి లాంచ్‌ప్యాడ్‌కు చేరుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్‌ 
Embed widget