Kohli Vs Smith: విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం
ఇక ఫ్యాబ్ 4లోని ముగ్గురితో పోల్చుకుంటే స్టీవ్ స్మిత్ అన్ని మైదానల్లో రాణించిన చరిత్ర ఉందని పాంటింగ్ గుర్తు చేశాడు. 53కిపైగా యావరేజీతో విదేశాల్లో సత్తా చాటాడని, దీంతో అతనేంటో తెలుస్తోందని అంటున్నాడు.
![Kohli Vs Smith: విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం Ricky Ponting stated that Steve Smith being the best player of Fab 4 Including Virat Kohli Kohli Vs Smith: విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/d00fd870ef590fe27132396fa847341a1738155547353901_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fab 4 Virat Kohli News: కరెంట్ జనరేషన్లో ఫ్యాబ్ 4గా పేరుపడిన విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ లలో ఎవరు గొప్పవారో చెప్పమంటే మొగ్గు కచ్చితంగా కోహ్లీ వైపే ఉంటుంది. ఫార్మాట్లకు అతీతంగా పరుగులు చేయడమే కాకుండా, ఛేదనలో చేజ్ మాస్టర్ అని బిరుదులు కూడా అదుకున్నాడు. ప్రజెంట్ జనరేషన్లో 81 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. తనకు దరిదాపుల్లో ఎవరూ కూడా లేరు. అయితే గత కొంతకాలంగా కోహ్లీ విఫలమవుతుండటంతో ఫ్యాబ్ 4లో అతని స్థాయిని తగ్గించేలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్.. కాస్త వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురిలో స్టీవ్ స్మితే గొప్ప ఆటగాడని తేల్చి పారేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్టులో అజేయ శతకాన్ని స్మిత్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెస్టుల్లో పది వేల పరుగుల మార్కును కూడా చేరుకున్నాడు. దీంతో స్మిత్ గొప్పతనాన్ని పాంటింగ్ వర్ణిస్తున్నాడు.
అందులో తోపు..
ఇక ఫ్యాబ్ ఫోర్లో లోని ముగ్గురితో పోల్చుకుంటే స్టీవ్ స్మిత్ అన్ని మైదానల్లో రాణించిన చరిత్ర ఉందని పాంటింగ్ గుర్తు చేశాడు. 53కిపైగా యావరేజీతో విదేశాల్లో సత్తా చాటాడని, ఈ నెంబర్లతోనే అతనేంటో తెలుస్తోందని ఎలివేషన్లు ఇస్తున్నాడు. స్మిత్ కెరీర్లో 57 ఓవర్సీస్ టెస్టులాడి 53కిపైగా సగటుతో 5084 పరగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 33 ఫిఫ్టీలు ఉన్నాయి. అందులో అత్యధిక స్కోరు 215 కావడం విశేషం. ఈ గణాంకాలతో అతని జనరేషన్లో గొప్ప బ్యాటర్ గా అభివర్ణించవచ్చని పాంటింగ్ పేర్కొంటున్నాడు. ఇది ఎవరూ కాదనలేని సత్యమని పేర్కొన్నాడు. ఫ్యాబ్ ఫోర్ లో ఎవరు గొప్ప అని అడిగితే, ఆయా దేశాల వారు ఆయా దేశాల క్రికెటర్లకే ఓటు వేస్తారని, అయితే ఆటతీరును చూస్తేనే ఈ విషయంతో స్పష్టత వస్తుందని తెలిపాడు. సొంతగడ్డపై పరుగులు ఎవరైనా సాధిస్తారని, విదేశాల్లోనే నిలకడగా రాణిస్తే గొప్పని వ్యాఖ్యనించాడు.
ఫ్యాబ్ 4లో మార్పులు..
గతంలో ఫ్యాబ్ 4 గురించి తొలిసారి వర్ణించినప్పుడు విరాట్ కోహ్లీ జోరు మీద ఉండేవాడని, జో రూట్ కాస్త దిగువన ఉండేవాడని, కానీ గత నాలుగేళ్లుగా రూట్ సత్తా చాటుతున్నాడని పాంటింగ్ పేర్కొన్నాడు. గత నాలుగేళ్లలోనే తను 19 సెంచరీలు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇక టెస్టుల్లో 12వేలకు పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. స్మిత్ తాజాగా 10వేల పరుగుల మార్కును చేరితే, కోహ్లీ, విలియమ్సన్ ఇంకా 9వేల మార్కు దగ్గరే ఉన్నాడు. మరోవైపు పదివేల పరగుల మార్కును చేరుకోవడంతోపాటు అజేయ సెంచరీని చేసి గాలే టెస్టును స్మిత్ మరింత మధురంగా మలుచుకున్నాడు. ఈ మ్యాచ్ కు తనే కెప్టెన్ కావడం విశేషం. ఇక పదివేల పరుగుల మార్కును చేరిన 15వ బ్యాటర్ గాను నిలిచాడు. ఈ జాబితాలో ఇండియా నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా నుంచి నలుగురు, ఇంగ్లాండ్ నుంచి ఇద్దరు, పాకిస్థాన్ నుంచి ఒక్కరు, శ్రీలంక నుంచి ఇద్దరు, సౌతాఫ్రికా నుంచి ఒక్కరు, వెస్టిండీస్ నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక కెరీర్లో 205వ ఇన్నింగ్స్ లోనే స్మిత్ పది వేల పరుగుల మార్కును చేరి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, పాంటింగ్ తర్వాత నిలిచాడు.
Read Also: Viral Video: పొట్ట చెక్కలయ్యే ఫీల్డింగ్ వీడియో.. వికెట్ కీపర్ పల్టీలు కొడుతూ..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)