అన్వేషించండి

Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ

Andhra News: త్వరలోనే తాను వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Ex MLA Rapaka Varaprasad Will Resign To Ysrcp: వైసీపీని వీడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కోనసీమ జిల్లా (Konaseema District) రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasad Rao) తెలిపారు. ఆ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన తనను వైసీపీ అవమానించిందని.. రాజోలులో ఎంత కష్టపడి పనిచేసినా తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డిని, నన్ను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తికి టికెట్ ఇచ్చి నన్ను అవమానించారు. వైసీపీ వాళ్లు పార్టీ మీటింగ్‌కు రమ్మని పిలిచినా నేను రాను అని చెప్పేశాను. ఇష్టం లేకపోయినా.. ఓడిపోతానని తెలిసినా పెద్దల సలహా మేరకు ఎంపీగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా. అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాను.' అని రాపాక స్పష్టం చేశారు.

జనసేనలో చేరుతారా.?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజులులో పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక నిలిచారు. ఆ టైంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల (గాజువాక, భీమవరం) ఓడిపోయారు. రాపాక సమీప వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఆయన అప్పటి అధికార వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. జనసేనాని పవన్ తనకు అపాయింట్‌మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదని.. తన గెలుపునకు స్థానికంగా తను చేసిన ఎలక్షనీరింగ్ కారణం అంటూ చెప్పేవారు. సొంత పార్టీపైనే విమర్శలు చేసి కొంతకాలానికి వైసీపీ గూటికి చేరారు. జనసేన పార్టీ బలపడే పార్టీ కాదని.. ఏదా గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచానంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

అనంతరం 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న రాపాక ప్రస్తుతం మళ్లీ కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఏకంగా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశానికి ఆయన హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ప్రస్తుత రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిసి కొన్ని కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం.

అసలు రీజన్ ఇదే..

అయితే, తనతో రాపాక చర్చించడంపై రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్పందించారు. ఇందులో రాజకీయ కోణం లేదని.. మలికిపురం కాలేజీలో పని చేస్తోన్న 25 మంది అధ్యాపకుల జీతాల విషయంలో చర్చించేందుకే రాపాక తనను కలిశారని చెప్పారు. అయితే, స్థానికంగా మాత్రం రాపాక జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారంటూ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మరి రాపాక జనసేనలో తిరిగి చేరుతారా.?, ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.?. లేదా వేరే పార్టీ వైపు చూస్తున్నారా.? అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.

Also Read: Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Devara Collection Worldwide: దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Mahabubabad News: సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం
సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం
Rapaka Varaprasad: జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?
జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?
Embed widget