Comet: ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
Rare Comet: 80 వేల ఏళ్ల క్రితం కనిపించిన అరుదైన తోకచుక్క అక్టోబర్ మొదటి వారంలో కనిపించగా భారత్‌కు చెందిన చాలామంది ఆస్ట్రో ఫోటోగ్రాఫర్లు ఆ అద్భుతాన్ని బంధించారు.
Comet C2023 A3 Rare Pictures: ఆకాశంలో అద్భుతం జరిగింది. ఖగోళంలో ఓ అరుదైన తోకచుక్క దర్శనమిచ్చింది. సాధారణంగా తోకచుక్కలు కనిపించడం మామూలే అయినా.. దాదాపు 80 వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోకచుక్క ఇప్పుడు మళ్లీ దర్శనమిచ్చింది. 'కామెట్ సి 2023 ఏ3'గా పిలిచే ఈ తోకచుక్కను.. శుచిన్‌షాన్ - అట్లాస్ పేరుతో పిలుస్తున్నారు. చైనా సైన్సెస్ అకాడమీకి చెందిన పర్పుల్ మౌంటెయిన్ అబ్జర్వేటరీ, హవాయి, చిలీ, దక్షిణాఫ్రికాలకు చెందిన 4 టెలిస్కోపుల సమూహం.. ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ అలర్ట్ సిస్టమ్ ఈ తోకచుక్కను గుర్తించాయి. అక్టోబర్ మొదటి వారంలో 'కామెట్ C/2023 A3' తోకచుక్క దృశ్యాలను భారత్‌కు చెందిన కొంతమంది స్టార్‌గేజర్స్ క్లిక్ చేశారు.
ఏపీలోని తిరుపతిలో
అటు, ఏపీలోని తిరుపతిలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తిరుపతికి చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డాక్టర్ అవినాశ్ ముక్కామల ఈ ఫొటోలు తీశారు. సోషల్ మీడియాలో వీటిని షేర్ చేయగా వైరల్‌గా మారాయి. మరోవైపు లద్దాఖ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని ఆస్ట్రో ఫొటోగ్రాఫర్‌లు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు.
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో..
లడఖ్‌లోని హన్‌లేలో గోంగ్మా లా: అద్భుతమైన ఫోటోను క్లిక్‌మనిపించేందుకు ఆస్ట్రోఫోటోగ్రఫీ మాస్టర్ క్లాస్ బృందం సముద్ర మట్టానికి ఈ నెల 1వ తేదీన 4,880 మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నా వారు ఉత్సాహంతో ఫోటోను సంగ్రహించారు. టీమ్‌లో చాలా మంది మొదటిసారి ఖగోళ ఫోటోగ్రాఫర్లు.. కానీ వారు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ పనిని సాధించారు. ఈ బృందంలో అభినవ్ సింఘై, అతిష్ అమన్, లక్ష్మీ నారాయణ, ప్రీతమ్ పాణిగ్రాహి, స్మితా సింగ్, అనుజ్ సింగ్, అంగ్‌చోక్ పద్మ ఉన్నారు.
View this post on Instagram
మహాబలిపురం సమీపంలో: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో ఈ నెల 4వ తేదీన ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ సత్యనారాయణన్ శ్రీధర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కామెట్ అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు. 'అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, మేము దాన్ని కోల్పోయే లోపు కామెట్‌ను పట్టుకోవడానికి ఓ యాత్రను ప్లాన్ చేశాం. తోకచుక్క సముద్రానికి దగ్గరగా వేలాడుతున్న మేఘపు తెర నుంచి బయటకు వచ్చింది. నిజానికి దాన్ని పూర్తిగా సంగ్రహించడానికి నేను ఫోకల్ లెంగ్త్‌ని 24 మిమీకి తగ్గించాల్సి వచ్చింది!' అని ఆయన పేర్కొన్నారు.
View this post on Instagram
హైదరాబాద్‌లో..
ఈ నెల 5వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన 'X' యూజర్ @itsardnepu, యానిమేషన్ ప్రొఫెషనల్, ఔత్సాహిక వన్యప్రాణులు, ఖగోళ ఫోటోగ్రాఫర్.. కామెట్ అందమైన ఫోటోను పోస్ట్ చేశారు. "కామెట్ C/2023-A3 Tsuchinshan-ATLASతో ఒక క్లోజప్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలోని ఔట్‌స్కర్ట్స్ నుంచి సంగ్రహించబడింది." అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
A closeup with Comet C/2023-A3 Tsuchinshan-ATLAS
— ardnepu (@itsardnepu) October 5, 2024
captured from Outskirts of Hyderabad, Telangana, India.@ApodNasa @isro @NASA @incredibleindia @tstdcofficial #ApodNasa #isro #NASA #incredibleindia #tstdcofficial pic.twitter.com/NipkaBSqUI
Also Read: Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు