అన్వేషించండి
Advertisement
Morning Top News: రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అసెంబ్లీవైపు వైసీపీ ఎమ్మెల్యేల చూపు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Morning Top News:
కేటీఆర్ ఇందివద్ద ఉద్రిక్తత
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతరులపై జరిగిన దాడి కేసు రాజకీయ సునామీ సృష్టిస్తోంది. ఈ కేసులో సహకరించారని కేటీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో గంటల వ్యవధిలోనే భారీగా కార్యకర్తలు హైదరాబాద్‌లోని నందినగర్‌కు చేరుకున్నారు కేటీఆర్ అరెస్టును అడ్డుకుంటామని నినదించారు. అర్ధరాత్రి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలను కేటీఆర్ పలకరించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయపరంగా ఎదుర్కుంటామని అన్నారు. అభిమానంతో వచ్చిన వారిని ఇంటికి వెళ్లిపోవాలని కేటీఆర్ చెప్పినా వెళ్లేందుకు మాత్రం వాళ్లు అంగీకరించలేదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు
లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో BRS నేత పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. కేటీఆర్, BRS ముఖ్యనేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు రిపోర్టులో వెల్లడించారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
వికారాబాద్ జిల్లాల్లో కలెక్టర్‌పై దాడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి.. కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి కంగుతిన్నారని.. ఆ డ్యామేజీ కంట్రోల్ కోసమే లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్‌ఎస్ పార్టీకి ఆపాదించే కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని పట్నం ఆరోపించారు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అమరావతిలోనే HRC: ప్రభుత్వం
HRC, లోకాయుక్త కమిషన్ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వాటిని అమరావతిలోనే ఉంచుతామని, అందుకు వీలుగా చట్టసవరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై మద్దిపాటి శైలజ, ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్: జగన్
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ పెదవి విరిచారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేలా ఉందన్నారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్నారు. జగన్ వద్దంటున్నందున ఆయన మాటలను జవదాటి అయినా వెళ్లాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు
సినీ నటి శ్రీరెడ్డిపై తూ. గో జిల్లాలో కేసు నమోదైంది. YCP హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ మహిళా నేత మజ్జి పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై 196, 353(2), BNS-67, ఐటీఏ-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
1.77 కోట్ల సిమ్‌లు బ్లాక్
ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ టెలికాం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రభుత్వ టెలికాం శాఖ 1.77 కోట్ల మొబైల్ నంబర్లను నిలిపివేసింది. ఫేక్ కాల్స్ చేయడానికి వీటిని ఉపయోగించారు. దేశంలోని 122 కోట్ల మంది టెలికాం వినియోగదారులను ఇటువంటి కాల్స్ నుంచి రక్షించేందుకు ట్రాయ్ సహకారంతో టెలికాం విభాగం ఈ చర్య తీసుకుంది. ఇద్దరూ కలిసి ఫేక్ కాల్స్‌పై చర్యలను మరింత ముమ్మరం చేశారు. ట్రాయ్ గత నెలలో ఒక కొత్త విధానాన్ని రూపొందించింది. తద్వారా ఇప్పుడు టెలికాం ఆపరేటర్లు తామే స్వంతంగా మార్కెటింగ్, ఫేక్ కాల్‌లను ఆపవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్ష కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కమిషన్ కార్యదర్శి, సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్.పి.లు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్థానిక భాషల్లో వైద్య విద్య -మోదీ సంచలన ప్రకటన
స్థానిక భాషల్లో వైద్య విద్య అందిస్తామని ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ వైద్య విద్యను అందిస్తామని చెబుతున్నారు. బీహార్‌లోని దర్బంగాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మూడో T20 మ్యాచ్‌లో టీమిండియా విజయం
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన మూడో టీ20 సిరీస్ మ్యాచ్ లో తిలక్ వర్మ సెంచరీతో అదరగొట్టాడు. భారత్‌ను గెలిపించాడు. మొత్తం 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అంతకుముందు కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22 ఏళ్ల తిల్కర్ వర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement