Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Ysrcp: పేర్ని నాని ఆజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జరుగుతూండటంతో ఆయన బయటకు వచ్చారు. మచిలీపట్నం చేరుకుని కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
YSRCP Leader Perni Nani: వైఎస్ఆర్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన బియ్యం మాయం కేసులో ఆజ్ఞతంలోకి వెళ్లారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పదిరోజులుగా ఆయనఅందుబాటులో లేరు. హఠాత్తుగా ఆయన మచిలీపట్నంలోని తన నివాసంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన వచ్చాడని తెలుసుకుని YCP MLC లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ MLA కైలే అనిల్ కుమార్ ఇంటికి వచ్చి చర్చలు జరిపారు.
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని సతీమణి జయసుధపై ఈ నెల 10న బందరు తాలుకా పీఎస్ లో కేసు నమోదు అయిది. కేసు నమోదైన రోజున నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని నాని కుటుంబం.. ఎవరికీ అందుబాటులో లేదు. ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో పారిపోయారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే పేర్ని నాని భార్య జయసుధ జిల్లా కోర్టు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. జయసుధ బెయిల్ పిటీషన్ ను ఈ నెల 19కి తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి వాయిదా వేశారు. బెయిల్ పిటీషన్ వాయిదా పడిన కొన్ని గంటల తర్వాత తన నివాసంలో ప్రత్యక్షమమయ్యారు పేర్ని నాని. పేర్ని నాని వచ్చారన్న వార్త తెలుసుకుని పేర్ని ఇంటికి చేరుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. వారితో తాను ఎక్కడికీ పోలేదని వ్యక్తిగత పనుల మీద మాత్రమే వెళ్లానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
పేర్ని నాని ఒక్కరే ఆజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు.కేసులు నమోదు అయింది ఆయన భార్యపై కావడంతో...పేర్ని నాని అదుపులోకి తీసుకునే అవకాశం లేదు. మరో వైపు ప్రజల్లో పారిపోయారన్న చర్చ జరుగుతూడంటంతో .. వాటికి చెక్ పెట్టేందుకు భార్య కుమారుడ్ని మాత్రం ఆజ్ఞతంలోనే ఉంచి.. తాను బయటకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.