Top Headlines Today: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నేడు భేటీ- కొనసాగుతున్న కిషన్ రెడ్డి దీక్ష
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
కీలక సమావేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమవేశం అయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ నేడు (గురువారం) రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు- ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. గురువారం ఉదయం 10 గంటలకు పవన్, బాలకృష్ణ రాజమండ్రికి చేరుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకే తొలి దఫా ములాఖత్ లో సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు చంద్రబాబును కలిసి మాట్లాడుకున్నారు. న్యాయం గెలుస్తుందని, త్వరలో తాను జైలు నుంచి బయటకు వస్తానని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పడం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత పూర్తిగా ఇబ్బందుల్లో పడబోతున్నారా లేకపోతే.. కీలకమైన మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కిషన్ రెడ్డి దీక్ష భగ్నం
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకపోవడంతో యువతకు అన్యాయం జరిగిందంటూ కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24గంటల దీక్షను బుధవారం ఉదయం చేపట్టారు. అయితే ఆయన దీక్షకు సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఉందంటూ పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బెయిల్ పిటిషన్ ఎందుకు వేయడం లేదూ?
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కాం జరిగిందని అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. క్వాష్ పిటిషన్ వేశారు. వాదనలు వినిపించడానికి.. కౌంటర్ వేయడానికి ప్రభుత్వం రెండు వారాల సమయం అడిగింది.. దీంతో జడ్జి వారం రోజుల సమయం ఇచ్చారు. బెయిల్ పిటిషన్ వేసే విషయంలోనూ చంద్రబాబు ఆసక్తిగా లేరు. దీంతో క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగి నిర్ణయం వచ్చే వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగానే రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విజయనగరం టూర్
ఆంధ్రప్రదేశ్ నూతనంగా నిర్మించిన ఐదు వైద్య కళాశాలను సీఎం జగన్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. విజయనగరం వైద్య కళాశాలను ప్రత్యక్షంగా ప్రారంభిస్తుండగా, నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను వర్చ్యువల్‌గా ప్రారంభిస్తారు. వీటిలో మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను ఎంఈఐఎల్ నిర్మించింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 17 నూతన వైద్య కళాశాలల స్దాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టెట్‌కు ఏర్పాట్లు
తెలంగాణలో సెప్టెంబరు 15న నిర్వహించనున్న టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)-2023 పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. సీసీటీవీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పేపర్-1కు 1139 పరీక్షా కేంద్రాలు, పేపర్-2 నిర్వహణ కోసం 913 కేంద్రాలను కేటాయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఉపవాస దీక్ష పోలీసులు భగ్నం
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకపోవడంతో యువతకు అన్యాయం జరిగిందంటూ కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24గంటల దీక్షను బుధవారం ఉదయం చేపట్టారు. అయితే ఆయన దీక్షకు సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఉందంటూ పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
భారత్‌తో ఢీ కొట్టేదెవరు?
ఆసియా కప్ - 2023 ఫైనల్ బెర్త్‌ను ఇదివరకే ఖాయం చేసుకున్న భారత జట్టుతో తుదిపోరులో ఆడేది ఎవరో నేటితో తేలనుంది. పాకిస్తాన్ - శ్రీలంకల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన విజేత.. ఈనెల 17 (ఆదివారం)న భారత్‌తో తలపడనుంది. సూపర్ - 4లో ఇరు జట్లకూ ఇదే ఆఖరి ఛాన్స్ కాగా రెండు జట్లూ ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి దాయాదితో తలపడాలంటే పాకిస్తాన్.. గురువారం శ్రీలంకను ఓడించాలి. ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బేబీ హీరోయిన్‌కు భలే ఆఫర్స్
'బేబీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.. ఫస్ట్ మూవీతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించింది. ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.. కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. దీంతో ఈ మూవీ తర్వాత అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వస్తాయని అందరూ భావించాయి. కానీ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇంతవరకూ యంగ్ బ్యూటీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే పలు సినిమాకు సైన్ చేయడం ద్వారా వైష్ణవి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారుతోందని, త్వరలో సిద్ధు జొన్నలగడ్డ, అల్లు శిరీష్ వంటి యువ హీరోలతో జోడీ కట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వాయిదాల పర్వం
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ సినిమా ఎప్పుడు వస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. అధికారికంగా విడుదల తేదీ ప్రకటించినా కూడా, చెప్పిన సమయానికి వస్తుందని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఇటీవల కాలంలో వివిధ కారణాలతో వాయిదా పడిన చిత్రాలని, రిలీజ్ డేట్లు మార్చుకుంటూ వస్తున్న సినిమాలను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి