News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

టాలీవుడ్‌లో మళ్లీ మొదలైన వాయిదాల పర్వం, 'సలార్' సృష్టించిన గందరగోళమే కారణమా?

'సలార్' సినిమా వాయిదా పడుతుందని తెలిసిన వెంటనే టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారు అయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ఈ వాయిదాల పర్వం సంక్రాంతి వరకూ కొనసాగేలా ఉంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ సినిమా ఎప్పుడు వస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. అధికారికంగా విడుదల తేదీ ప్రకటించినా కూడా, చెప్పిన సమయానికి వస్తుందని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఇటీవల కాలంలో వివిధ కారణాలతో వాయిదా పడిన చిత్రాలని, రిలీజ్ డేట్లు మార్చుకుంటూ వస్తున్న సినిమాలను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమాని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అప్పుడెప్పడో ఎనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ వాయిదా పడుతుందని తెలియగానే, నిన్న మొన్నటి దాకా ఫిలిం మేకర్స్ అందరూ అదే డేట్ కి రావాలని పోటీ పడ్డారు. పోటాపోటీగా విడుదల తేదీలను ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ వాయిదాల పర్వం మొదలైంది. 

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేసిన 'స్కంద' సినిమాని 28వ తేదీకి వాయిదా వేశారు. 'రూల్స్ రంజన్', MAD మూవీస్ ని కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'పెద కాపు 1' సినిమాని ఈ నెల 29న థియేటర్లలో తీసుకురానున్నట్లు తెలిపారు. వీటికి పోటీగా 'ది వ్యాక్సిన్ వార్' చిత్రం కూడా ఉండటతో, ఒకేసారి దాదాపు అర డజను సినిమాలు బాక్సాఫీసు బరిలో దిగే పరిస్థితి వచ్చింది. 

ఇక 'స్కంద' సినిమా పోస్ట్ పోన్ అవడంతో 'చంద్రముఖి 2' & 'మార్క్ ఆంటోనీ' వంటి రెండు డబ్బింగ్ చిత్రాలని లైన్ క్లియర్ అయింది. అయితే సీజీ వర్క్ పెండింగ్ ఉండటంతో 'చంద్రముఖి 2' సినిమాని సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. దీంతో ఎప్పటి నుండో విడుదల తేదీ కోసం వేచి చూస్తున్న చిన్నా చితకా చిత్రాలన్నీ రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నాయి.

'చాంగురే బంగారు రాజా' 'రామన్న యూత్' సినిమాలని సెప్టెంబర్ 15న థియేటర్లలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 22న 'అష్టదిగ్బంధనం', 'తంతిరం' చిత్రాలను విడుదల చేయనున్నారు. మరోవైపు 'రూల్స్ రంజన్' చిత్రాన్ని సెప్టెంబర్ 28 నుంచి తప్పించి అక్టోబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అలానే MAD మూవీని కూడా వాయిదా వెయ్యాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే 'సలార్' సినిమాని వాయిదా వేస్తున్నట్లు ఎట్టకేలకు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ను వెల్లడించలేదు. దీంతో ఈసారి డైనోసార్ ఏ సినిమాల మీద వచ్చి పడుతుందో అనే చర్చ మొదలైంది. ఒకవేళ సలార్ పార్ట్-1 సంక్రాంతికి రావాలని ఫిక్స్ ఐతే మాత్రం, ఆల్రెడీ విడుదల ప్లాన్ చేసుకున్న 'గుంటూరు కారం', 'నా సామి రంగా', 'హను మాన్', 'ఈగల్' చిత్రాల్లో కొన్ని పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Also Read: 'హాయ్ నాన్న' అప్డేట్ - కళ్లతోనే మాట్లాడేసుకుంటున్న నాని, మృణాల్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 14 Sep 2023 06:00 AM (IST) Tags: Salaar Chandramukhi 2 Salaar Postponed Rules Ranjan Skanda Release Date Salaar New Release Date Salaar Cease Fire MAD

ఇవి కూడా చూడండి

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్