News
News
X

CM KCR Phone: ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్- మంత్రి ఏం చెప్పారంటే?

సీఎం కేసిఆర్ ఆదేశాలతో ఎస్సారెస్పీని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఫోన్ ద్వారా పరిస్థితిని సీఎంకి వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

FOLLOW US: 

తెలంగాణ రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సాయంత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ డ్యామ్ పై నుంచే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి వివరించారు. 

ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 90.00 టీఎంసిలైతే... ప్రస్తుతం 75.00 టీఎంసిల వద్ద నీరు నిలువ ఉందని తెలిపారు ప్రశాంత్‌రెడ్డి. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందన్నారు. దీంతో ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రశాంత్‌రెడ్డి చెప్పిన వివరాలను విన్న సీఎం కేసీఆర్ 75 టీఎంసిల వద్ద నీటి లెవెల్‌ను మెయింటైన్ చేస్తూ, ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లోకు అనుగుణంగా కాస్తంత ఎక్కువ పరిమాణంలో నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 

మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎస్సారెస్పీ దిగువన ఉన్న లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆరా తీశారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున మిగులు జలాలు వదులుతున్నందున ఎస్సారెస్పీ లోకి సుమారు 6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని మంత్రి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొడిచెర్ల, చాకిరియాల్, సావెల్, తడపాకల్, దొంచందా, గుమ్మిర్యాల్ గ్రామాల వద్ద పోలీస్, రెవెన్యూ సిబ్బందిని నియమించి ఏ ఒక్కరూ గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అధికారులకు బాధ్యతలు పురమాయించారు. 

పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల అధికారులు మొదలుకొని సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి హితవు పలికారు. గోదావరిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ పంపుసెట్లు, మోటార్ల కోసం రైతులు వెళ్లకూడదని మంత్రి సూచించారు. గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ దండోరా వేయించాలని అధికారులకు ఆదేశించారు. దొంచందా, తడపాకల్, పోచంపాడ్ అంబేడ్కర్ కాలనీ ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి, భోజన, వసతి ఏర్పాట్లు కల్పించాలని అధికారులకు సూచించారు. 

బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సుమారు 22 గ్రామాల పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి ట్రాన్స్‌కో అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనే ప్రజలకు అండగా నిలవాలని, క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌కో సిబ్బంది అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, అవసరమైన నిధులను తాము సమకూరుస్తామని, విద్యుత్ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరిస్తూ కరెంట్ సరఫరాను వెంటనే పునరుద్ధరించేందుకు కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ట్రాన్స్‌కో సిఎండి గోపాల్‌రావుకు ఫోన్ ద్వారా పరిస్థితి తీవ్రతను వివరించారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. ఎస్సారెస్పీ రిజర్వాయర్ ప్రాంతమైన పోచంపాడు వద్ద కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో వరద పరిస్థితిని సమీక్షించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దేలా చూడాలని సూచించారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. కలెక్టర్ సహా అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. చెరువులు, వాగులు పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని సంతరించుకొని అలుగులు ప్రవహిస్తున్నందున, వాటి వద్దకు ఎవరు కూడా వెళ్ళొద్దని హితవు పలికారు. ఆహ్లాదం కోసం వెళితే వర్ష తీవ్రత వల్ల వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. 

విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాపాయం బారిన పడకుండా చూసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఎగువ గోదావరి నుంచి వరద ప్రవాహానికి అంతకంతకు పెరుగుతున్నందున బోధన్ రెవెన్యూ డివిజన్‌లోని హంగర్గ గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించేలా చూడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి ఫోన్ ద్వారా సూచించారు.

Published at : 13 Jul 2022 11:31 PM (IST) Tags: cm kcr telangana rains Telangana CM SRSP

సంబంధిత కథనాలు

Poker Players Arrest: టాస్క్ ఫొర్స్ పోలీసుల మెరుపు దాడి, 13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ - భారీగా నగదు స్వాధీనం

Poker Players Arrest: టాస్క్ ఫొర్స్ పోలీసుల మెరుపు దాడి, 13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ - భారీగా నగదు స్వాధీనం

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Swine Flu in Adilabad: ఆదిలాబాద్ లో స్వై‌న్ ఫ్లూ కలకలం, ఆందోళనలో ప్రజలు

Swine Flu in Adilabad: ఆదిలాబాద్ లో స్వై‌న్ ఫ్లూ కలకలం, ఆందోళనలో ప్రజలు

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో కుంగిన బ్రిడ్జి, పక్కకు ఒరిగిపోయిన పిల్లర్ - ఏ క్షణమైనా కూలే ఛాన్స్!

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో కుంగిన బ్రిడ్జి, పక్కకు ఒరిగిపోయిన పిల్లర్ - ఏ క్షణమైనా కూలే ఛాన్స్!

Heavy Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన!

Heavy Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన!

టాప్ స్టోరీస్

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం