(Source: ECI/ABP News/ABP Majha)
Nizababad Rains: నిజామాబాద్ జిల్లాలో గ్యాప్ లేకుండా వానలు, రికార్డు స్థాయిలో వర్షపాతం - వేల ఎకరాల్లో పంట నష్టం
Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షల్లో నష్టం వాటిల్లింది. 10 వేల ఎకరాల వరకు పంటలు ఇప్పటికే వరదల వల్ల దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.
నిజామాబాద్ జిల్లాలో వరుణుడు తగ్గేదే లే అంటున్నాడు. గత నాలుగైదు రోజులుగా గ్యాప్ లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షల్లో నష్టం వాటిల్లింది. నీట మునిగిన పంటలు, కోతకురైన రోడ్లు, కూలిన ఇళ్లతో జనజీవనం అతలాకుతలమవుతోంది. నేలకు వంగిన విద్యుత్ స్తంభాలు, తెగిన కరెంటు వైర్లతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్ప డుతోంది. జిల్లాలో పలుచోట్ల వాగులు రోడ్లపై పారడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వరద నీటిని దాటే ప్రయత్నం మాత్రం చేయవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఇలా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.
దెబ్బతిన్న ఇళ్లు, నీట మునిగిన పంట పొలాలు
ఉమ్మడి జిల్లాలో వర్షాలకు 232 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, మరికొన్ని ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకొరగగా, కొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో వాగులు, చెక్‌డ్యాంలు, చెరువుల మత్తడులు పొంగుతుండడంతో అన్ని గ్రామాల పరిధిలో జలకళ సంతరించుకుంది. నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లోనిలో తట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చిచేరుతోంది. వరదలు పెరిగే అవకాశం ఉండడంతో కలెక్టరేట్‌లో ప్రత్యేకసెల్ ఏర్పాటు చేసి కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. జిల్లాలో మంగళవారం 33.7 మి.మీల వర్షం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మెండోరా మండల కేంద్రంలో 66.3 మి.మీల వర్షం పడింది.
రికార్డు స్థాయిలో వర్షపాతం..
నిజామాబాద్‌లో జూన్ నుంచి ఇప్పటి వరకు 269.6 మి.మీల వర్షం పడాల్సి ఉండగా రికార్డు స్థాయిలో 570.6 మి.మీల వర్షం పడింది. ప్రాథమిక అంచనా ప్రకారం 10 వేల ఎకరాల వరకు పంటలు ఇప్పటికే వరదల వల్ల దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వరద నీరు చేళ్లలో నిలిచి సోయా ఎక్కువశాతం దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. వరి పొలాల్లో నీళ్లు నాటేయగానే నిల్వ ఉండడంతో కొంతమేర దెబ్బతిన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 968 చెరువులు ఉండగా 673 చెరువులు పూర్తిస్థాయిలో నిండి మత్తడులు పారుతున్నాయి. మి గతా చెరువులన్నీ 75 నుంచి వందశాతంలోపు నీళ్లు ఉన్నాయి. జనజీవనానికి ఇబ్బందులు లేకుండా సహాయ చర్యలు చేపట్టాలని చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.
జిల్లాలో వర్షాలకు పంట నష్టం
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచ నాల మేరకు 106 గ్రామాల్లోని 7,900 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అనేక మండలాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. ఇళ్లు కూలిపోయా . నందిపేట మండలం బజార్ కొత్తూరు వద్ద ఏడాది క్రితం కట్టిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్మూర్ మల్లారెడ్డి చెరువుకు అధికారులు గండికొట్టాల్సి వచ్చింది. భీంగల్లో కరెంట్ షాక్ కొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. జిల్లాకు కేటాయించిన ప్రత్యేకా ధికారి క్రిస్టినా జెడ్ చోంగూ జిల్లాలోని పలు మం డలాల్లో పర్యటించి, కలెక్టరేట్ సమీక్ష నిర్వ హించారు. తాజాగా ఐజీ కమలాసన్రెడ్డి ఎస్సారె స్పీకి పరిస్థితిని పర్యవేక్షించారు. ఇంత నష్టం జరిగినప్పటికీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.