Maoists Letter: మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం, ఎమ్మెల్యే వినోద్‌కు బెదిరింపులు!
Telangana News | బెల్లంపల్లి ఎమ్మెల్యే జీ వినోద్ కుమార్, ఆయన అనుచరులకు మావోయిస్టుల బెదిరింపు లేఖ విడుదల చేశారు. తీరు మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

Mancherial News | బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖ అధికార పార్టీ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తో పాటు ఆయన అనుచరులను హెచ్చరిస్తూ మావోయిస్టు అనుబంధ సంఘం సి.కా.స లేఖ విడుదల చేసింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలన నుంచి మార్పుకోరుకున్న ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని.. అయితే ఎమ్మెల్యే వినోద్ అండతో బెల్లంపల్లిలో ఆయన అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారని సి.కా.స లేఖలో ఆరోపించింది.
ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే వినోద్ పి.ఏ.ప్రసాద్ భూ కబ్జాలను ప్రోత్సాహిస్తున్నాడని.. ప్రభుత్వ భూములు నిరుపేదలకు పంచాలి సి.కా.స. సూచించింది. ఇప్పటికైనా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఆయన అనుచరులు తీరు మార్చుకోకపోతే ప్రజా కోర్టులో వారికి శిక్ష తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు. కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రబాత్ పేరుతో సి.కా.స ఆ లేఖ విడుదల చేసింది. బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల హచ్చరిక లేఖపై చర్చ జరుగుతోంది.

Also Read: Hyderabad News: బ్యాగుల్లో చాక్లెట్, స్వీట్ ప్యాకెట్స్ - అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులకు షాక్

Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















