MLC Kavitha: ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం.. ఈ వీరాభిమాని ఏంచేశాడో తెలుసా? ఏకంగా గాల్లోనే కంగ్రాట్స్
స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరించడంతో కవిత ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ అభిమాని కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ అనే వ్యక్తి కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ చేసి భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపాడు. 40 ఫీట్ల పొడవున్న ఈ భారీ ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా చూశారు.
మరోవైపు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరించడంతో కవిత ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. కాగా, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ తరఫున ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండిపోయాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో కవిత ఎన్నిక ఏకగ్రీవం అయింది.
మంత్రి పదవి ఇస్తారా?
ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో మరో చర్చ జోరుగా సాగుతోంది. కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి కచ్చితంగా రానుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఎలాగూ మరో సంవత్సరాలు పదవిలో ఉంటారు. ఇప్పుడు కేబినెట్‌లోకి తీసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ సర్కారే వస్తే కంటిన్యూ చేయచ్చనే ఆలోచనలో గులాబీ పెద్దలు ఉన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేబినెట్‌లో ఎలాగూ ఒక శాఖ వైద్యఆరోగ్య శాఖ ఖాళీగా ఉంది కాబట్టి అది ఆమెకు ఇవ్వచ్చని భావిస్తున్నారు. దానికి తోడు ఎన్నికలకు ముందే కేసీఆర్ మంత్రి మండలిని ప్రక్షాళన చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.
మరోవైపు, కేసీఆర్‌పై విపక్షాలు చేసే విమర్శల్లో తరచూ కుటుంబ పాలన గురించి ఉంటుంది. అయిన వారికి రాజకీయ ఉద్యోగాలు ఇచ్చుకొని నిరుద్యోగగులను విస్మరిస్తున్నారని విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో కవితకు కూడా మంత్రి పదవి ఇస్తే ఈ విమర్శలు మరింత అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కవితకు మంత్రి పదవి వస్తుందా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది.
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు
Also Read: RRR Janani Song: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?