అన్వేషించండి

Banswada News: చోరీ చేసి ఆదమరిచి నిద్రపోయిన దొంగ-పట్టుకున్న గ్రామస్తులు

దొంగతనం చేసి నిద్రలోకి జారుకున్న దొంగ గ్రామస్తులకు పట్టుబడ్డారు. అతన్ని పోలీసులకు అప్పగించారు ఊరి ప్రజలు. అసలు ఏం జరిగిందంటే..?

Banswada News: దొంగతనం చేసిన తర్వాత దరిదాపుల్లో లేకుండా పారిపోతారు దొంగలు. అందినకాడికి దోచుకుని ఎవరి కంట పడకుండా జారుకుంటారు. ఎవరికీ  అనుమానం రాకుండా పరారవుతారు. కానీ... ఓ దొంగ మాత్రం ఇంటిని దోచుకుని ఊరి నుంచి వెళ్లిపోకుండా తాపీగా నిద్రపోయాడు. చెట్టు కింద పడుకుని గాఢ నిద్రలోకి  జారుకున్నాడు. కట్‌ చేస్తే... గ్రామస్తులకు పట్టుబడ్డాడు. వింతగా ఉంది కదూ. ఈ సంఘటన బాన్సువాడలో జరిగింది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) మండలం బోర్లంక్యాంపు గ్రామానికి చెందిన కుర్మ రాజు దంపతులు... ఈనెల 17న (ఆదివారం) ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ముందే గమనించి పెట్టుకున్నాడో... లేక... తాళం వేసి ఉండటం చూసి వచ్చాడో ఏమో గానీ... కుర్మరాజు ఇంటిపై కన్నేశాడు తాడ్వాయి మండలం కనకల్‌ గ్రామానికి చెందిన బత్తుల మోహన్‌. తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి అర్థరాత్రి సమయంలో చొరబడ్డాడు. బీరువాను ధ్వంసం చేశారు. అందులోని ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. ఆ తర్వత నెమ్మదిగా ఆ ఇంటి నుంచి బయటపడ్డారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ఆ తర్వాతే ట్విస్ట్‌ మొదలైంది.

దొంగతనానికి పాల్పడి తర్వాత.. ఊరు వదిలి వెళ్లిపోకుండా... నిద్రలోకి జారుకున్నాడు ఆ దొంగ. నిద్రమేలుకుని అర్థరాత్రి వరకు కష్టపడి దొంగతనం చేశాడనో ఏమో.. ఆ దొంగకు నిద్ర ముంచుకొచ్చింది. దీంతో మార్గ మధ్యలో ఓ చెట్టు చూసుకుని... దాని కింద నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారిపోయినా సరే నిద్రపోతూనే ఉన్నాడు. 

ఇక.. ఇంతలో కూర్మరాజు ఉదయం 5గంటలకు ఇంటికి తిరిగివచ్చాడు. ఇంటి తాళాలు పగులకొట్టి ఉండటం చూశాడు. బీరువా ధ్వంసం చేసి ఉండటం చూసి బెంబేలెత్తిపోయాడు. అందులోని నగలు లేకపోవడంతో... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతని ఇంటిని చేరుకుని... మొత్తం పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు.

ఇందంతా జరుగుతూనే ఉంది... కూర్మరాజు ఇంట్లో దొంగతనం చేసిన దొంగ బత్తుల మోహన్‌ మాత్రం ఇంకా చెట్టుకింద నిద్రపోతూనే ఉన్నాడు. ఉదయం 6గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు యువకులు వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో చెట్టు కింద నిద్ర పోతున్న దొంగను చూశాడు. అతన్ని చూడగానే ఎందుకు అనుమానాస్పదంగా అనిపించాడు వాళ్లకి. దీంతో అతన్ని నిద్రలేని వివరాలు అడిగారు. అతను చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో... తనిఖీ చేశారు. అతని దగ్గర చోరీకి గురైన ఆరు తులాల బంగారం కనిపించడంతో.. అతనే దొంగ అని నిర్ధారించి పట్టుకున్నారు. వెంటనే బత్తుల మోహన్‌ను పోలీసులకు అప్పగించారు. దొంగిలించిన ఆరు తులాల బంగారు ఆభరణాలు దొరకడంతో... కూర్మరాజు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక... పోలీసులు దొంగ అయిన బత్తుల మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఇంకా ఎంతమంది ఇళ్లలో ఇలా దొంగతనం చేశాడో ఆరా తీస్తున్నారు. ఇది... దొంగతనం తర్వాత నిద్రలోకి జారుకున్న ఆ దొంగ కథ. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget