Nirmala Fire On CM Kcr : దేశ ఆర్థిక వ్యవస్థపై జోకులా ? కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ ఘాటు విమర్శలు !
దేశ ఆర్థిక వ్యవస్థను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.
Nirmala Fire On CM Kcr : దేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్తోందన్న అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ సీరియస్ అయ్యారు. 2014లో తెలంగాణలో అప్పులు రూ.60వేల కోట్లు. ఇప్పుడు మూడు లక్షల కోట్లు దాటింది. కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నాము.. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నాము. రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగం లో పొందుపరిచిన నిబంధన.. దానినే మేము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అప్పులపై మానిటరింగ్ చేయాల్సిందేనని స్పష్టం చేసిన నిర్మలాసీతారామన్
అప్పులపై ఎవరో ఒకరు మానీటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఆర్బీఎం లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పానని గుర్తు చేశారు. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ.. అక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చామన్నారు. అందరినీ ఒకేలాగా చూస్తాం.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తామని.. పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా అని కేసీఆర్‌ను నిర్మలా సీతారామన్ ప్రశ్నంచారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలి. ఇది దేశం కోసం అంటూ హితవు పలికారు.
దేశ ప్రగతిలో భాగం కాకుండా ఐదు ట్రిలియన్ల లక్ష్యంపై జోకులా ?
దేశ ప్రగతిలో ఎలా భాగస్వామ్యం కావాలని ఆలోచించకుండా.. ఐదు ట్రిలియన్లు ఓ పెద్ద జోక్ అనడమేంటని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను జోక్ అంటున్నారంటే.. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనను కించపరుస్తున్నట్టేనని మండిపడ్డారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్‌తో పాటు సబ్ కా ప్రయాస్ కూడా ఉంటుందని.. తెలిపారు నిర్మలా సీతారామన్.
మెడికల్ కాలేజీలపై ఎలా ప్రతిపాదనలు పంపాలో కూడా తెలియదా ?
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన విమర్శలను కూడా ఖండించారు. అసలు మెడికల్ కాలేజీల ప్రతిపాదనలు సరిగ్గా రాలేదన్నారు. మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదా? అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదు. నోడేటా అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ సెటైర్లు వేశారు. మాపై విమర్శలు చేస్తున్నారు.. మీ సంగతేంటీ అని ప్రశ్నించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని గుర్తు చేశారు.