KTR: నిర్మల్ కలెక్టర్ పెద్దమనసు.. మంత్రి కేటీఆర్ ప్రశంసలు, స్థానికులు కూడా..
అనాథగా మారిన ఐదేళ్ల పాపను నిర్మల్ కలెక్టర్ దత్తత తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ కలెక్టర్ చేసిన సాయంపై స్పందించారు. కలెక్టర్ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పెద్ద మనసు చాటుకున్నారు. అనాథగా మారిన ఐదేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. ముథోల్ మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన భూమవ్వ అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం చనిపోయింది. భర్త కూడా ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో ఐదేళ్ల రోహిణీ అనాథగా మారిపోయింది. ఆ చిన్నారి దీన స్థితిని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయగా.. మంత్రి స్పందించారు. ఆ చిన్నారిని ఆదుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
Request @WCDTelangana and @Collector_NML to take full care of this child’s well-being https://t.co/kDOqgnOPV3
— KTR (@KTRTRS) November 17, 2021
దీనిపై స్పందించిన కలెక్టర్ మంత్రి సూచన మేరకు ఆయన బుధవారం ఎడ్ బిడ్ గ్రామాన్ని సందర్శించారు. ఐదేళ్ల చిన్నారి రోషిణితో మాట్లాడారు. నీ పేరేంటి అని ప్రశ్నించగా.. రోషిణి అని సమాధానం చెప్పింది. ‘‘నువ్వు స్కూల్‌కెళ్తున్నవా..’’ అనగా ఆ పాప బాలబడికి (అంగన్‌వాడీకి) వెళ్తున్నానని చెప్పింది. ‘‘మీ అంగన్‌వాడీ టీచర్ ఎవరు..’’ అనగా.. ‘‘అగో ఆమెనే..’’ అని చూపించింది.
Many thanks Collector Garu 👍 https://t.co/9LDueudg6Q
— KTR (@KTRTRS) November 17, 2021
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోషిణి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. శిశు సంరక్షణ అధికారులతో మాట్లాడి, రోషిణిని ఆదిలాబాద్‌లోని శిశు గృహానికి తరలించారు. గ్రామస్తులు దాతల ద్వారా సేకరించిన రూ.1.80 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ శివప్రసాద్, సీడీపీవో శ్రీమతి పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ కూడా కలెక్టర్ చేసిన సాయంపై స్పందించారు. కలెక్టర్ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
మానవత్వం పరిమళించే మంచి మనిషి మంత్రి శ్రీ కేటీఆర్ అన్నకు జేజేలు 👏 👏 pic.twitter.com/VdDEMa8GzR
— Venkat Rasala (@venkatrasala1) November 18, 2021
Also Read: Robbery: కుక్కలు చనిపోవడం, దోపిడీ చేశాక చంపేయడం.. ఇది ఆ గ్యాంగు పనేనా?
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి