అన్వేషించండి

Telangana News: నీటి పంపకాలలో రాజీపడం, అవసరమైతే బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ ఎదుట హాజరవుతా: మంత్రి ఉత్తమ్‌

Uttam Kumar Reddy | తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపులు సాధించుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకోసం అవసరమైతే బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట హాజరవుతానని స్పష్టం చేశారు.

Krishna River Water Dispute | హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడేదే లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాల విచారణకు అవసరమైతే తాను స్వయంగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట హాజరవుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, నిపుణులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆదివారం నాడు చర్చలు జరిపారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రతినీటి బొట్టును సాధించుకుందాం, ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదన్నారు.

కృష్ణా నదీ జలాల వివాదంపై వాదనలు వినిపిస్తున్న న్యాయనిపుణులు, న్యాయవాదులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో కృష్ణా నదీ జలాల అంశాలపై జరగనున్న విచారణపై అధికారులను, న్యాయనిపుణులను ఆయన ఆరా తీశారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. నీటి కేటాయింపులు సక్రమంగా జరగకపోవడంతో దశాబ్దాల నుంచి తెలంగాణ ప్రజలు నష్టపోయారని మంత్రి ఉత్తమ్ అన్నారు.

గతంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ప్రశ్నించే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో జరిగిన అసమతుల్యతను సరిదిద్దడానికి కట్టుబడి ఉందని, ఈ విషయంపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోబోమని, అవసరమైతే ట్రైబ్యునల్ ఎదుట తాను హాజరవుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget