Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు త్వరలోనే తొలి విడత సాయం బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తయిన ఇంటి యజమానులకు నగదు సాయం అందిస్తారు.

Indiramma Houses In Telangana | హైదరాబాద్: నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీం లబ్ధిదారులకు తొలి విడతలో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిధులు సిద్ధం చేసింది. ఇల్లు మంజూరై బేస్‌మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి మూడు వేల కోట్ల లోన్ తీసుకుంది. హడ్కో మంజూరు చేసిన నిధులు హౌసింగ్ కార్పొరేషన్ కు వచ్చాక లబ్ధిదారులకు తొలి విడత సాయం రూ.1 లక్ష అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం జమ చేయ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైన పథకం కావడంతో ఇందుకోసం ఓ కార్యక్రమం కొందరికి చెక్కులు ఇవ్వాలని, మిగతా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో లక్ష రూపాయల సాయం జమ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.
వారికి రూ.1 లక్ష రుణం..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తున్నారు. ఏప్రిల్ 6 సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1265 ఇండ్ల వివరాలను అప్లోడ్ చేసినట్లు సమాచారం. తొలి విడత సాయం రూ.1 లక్ష అందించేందుకు బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అధికారులు సేకరించారు. ఆ ఇండ్ల ఫోటోలు తీసి వాటికి జియో టాకింగ్ చేసి ఆన్‌లైన్ యాప్‌లో అప్డేట్ చేస్తున్నారు. బేస్మెంట్ వరకు సైతం ఇల్లు నిర్మించుకునేందుకు ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వమే రూ.1 లక్ష రుణం ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో కొందరు లబ్ధిదారులకు లక్ష రూపాయల రుణాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి లబ్ధిదారుల వివరాలు సేకరించి వారికి సైతం లక్ష రూపాయల రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు.
పీఎంఏవై కింద రాష్ట్రానికి సాయం..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకి వెళ్ళు మంజూరు చేసే అంశంపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. వాస్తవానికి పీఎంఏవై కింద వెళ్ళు పొందాలంటే ఆవాస్ ప్లస్ యాప్ తో సర్వే చేసి లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా అమ్మాయి ల కోసం యాప్ రూపొందించి లబ్ధిదారుల వివరాలు పొందుపరిచింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్ లో నమోదు చేసిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ సూచించారు. తెలంగాణకు కేంద్రం PMAY అర్బన్ కింద 1,13,ఇళ్లను మంజూరు చేసింది. అర్బన్ స్కీమ్ కింద 1.5 లక్షలు, రూరల్ స్క్రీన్ కింద 77 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 71,000 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయగా ఊరిలో 44 వేల 616 మందికి ఇళ్ల పత్రాలు అందించారు. కాస్త కూస్తో ఆర్థిక స్తోమత ఉన్నవారు బ్యాట్మెంట్ వరకు ఇంటి పనులు చేపట్టారు. బేస్మెంట్ వరకు నిర్మించుకునే తో మొదలైన వారికి లక్ష రూపాయల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.






















