అన్వేషించండి

CM Revanth Reddy: ఎస్సారెస్పీ 2కి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ramreddy Damodar Reddy | ఎస్సారెస్పీ 2కి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో జీవో జారీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Sri Ram Sagar Project SRSP 2 Project | తుంగతుర్తి: నల్గొండ జిల్లాలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దాని క్రెడిట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy) దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ఆర్‌డీఆర్ (మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి) ఎస్సారెస్పీ 2గా నామకరణం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి పేరును ఎస్సారెస్పీ 2కు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 24 గంటల్లో జీవో జారీ చేస్తామన్నారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘రాంరెడ్డి దామోదర్ రెడ్డి మ‌ర‌ణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన మరణం చాలా బాధాకరం, కానీ ఆయన జీవితం త్యాగానికి, నిబద్ధతకు, ప్రజాప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి చేరినా.. ఆస్తుల కోసం కాదు, కార్యకర్తలు, పార్టీ కోసం పని చేశారు.

నేటి కాలంలో ఒక్కసారి ప్రజా ప్రతినిధి అయినా  కోట్లు కూడబెడతారు. కానీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములనూ త్యాగం చేశారు. ఆయన నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జెండాను అగ్రస్థానంలో ఉంచారు. గోదావరి జలాలను ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తీసుకురావడానికి ఆయన పోరాటం మరువలేనిది.

ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా గోదావరి జలాల పోరాటం
ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా గోదావరి నీళ్లను నల్గొండ జిల్లాకు తెచ్చే ప్రయత్నంలో దామన్న వహించిన పాత్ర కీలకం. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ 2 ప్రారంభానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. సూర్యాపేట కేంద్రంగా పనిచేసినా, తుంగతుర్తి నియోజకవర్గంలోని కార్యకర్తలకు దామన్న పెద్ద అండగా నిలిచారు. ఆయన సేవల ఫలితంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ 50 వేల మెజారిటీతో గెలిచారు. ఆయనను "టైగర్ దామన్న"గా సంబోధించడం ఆయన త్యాగానికి, ధైర్యానికి ఇచ్చిన గుర్తింపు.

కాంగ్రెస్‌తోనే చివరివరకూ జీవితం
రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అమితమైన ప్రేమతో జీవించారు. చివరి శ్వాస కూడా కాంగ్రెస్ జెండాతోనే విడిచారు. జోడెద్దుల్లా రాంరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీని నల్గొండలో నిలబెట్టారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలియజేశారు. రాహుల్ గాంధీ స్వయంగా రాంరెడ్డి కుమారుడు సర్వోత్తం‌కు సంతాప లేఖ రాసి, భవిష్యత్తులో రాజకీయంగా కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎస్సారెస్పీ 2కు దామోదర్ రెడ్డి పేరు
నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతల సూచన మేరకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్–2 ప్రాజెక్టుకు "ఆర్డీఆర్ ఎస్‌ఆర్‌ఎస్‌పీ" అని రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి సంబంధించి 24 గంటల్లో జీవో కూడా జారీ చేస్తాం. రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదు. వారు చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని రేవంత్ రెడ్డి అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget