By: ABP Desam | Updated at : 28 Jul 2022 08:27 AM (IST)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చానీయాంశంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం మరింత రసవత్తరంగా మారనుంది. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీని తన మాటలతో ఇరుకున పెట్టడుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఎట్టకేలకు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ఊపు మీదున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో విజయం సాధించేందుకు రాజగోపాల్‌రెడ్డిని కీలకంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారిన అనంతరం ఆయన చేత రాజీనామా చేయించి తెలంగాణలో మరో ఉప ఎన్నికకు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలకంగా ఉన్నారు. అయితే రాజగోపాల్‌రెడ్డి తమ పార్టీలోకి రావడంతోపాటు మరో ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే రానున్న సాధారణ ఎన్నికలకు తెలంగాణలో తమకు ఎదురు ఉండదనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండేళ్ల నుంచి బీజేపీతో సన్నిహితంగా వ్యవహరించడంతోపాటు సొంత పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని ఇప్పుడు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు కమలనాథులు. పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లేందుకు బీజేపీ ఆసక్తి చూపుతోంది. అయితే ఇదే అంశంపై ఢిల్లీ పెద్దలతో కీలకంగా చర్చించిన కాంగ్రెస్ నేతలు తమకు బలమైన ప్రాంతంగా ఉన్న నల్లొండ జిల్లాలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు అంతే వ్యూహంతో సాగాలని, నష్ట నివారణ కోసం అవసరమైతే పార్టీ మారకముందే రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
బ్రదర్స్ మధ్య పోటీ ఉంటుందా..?
మునుగోడు నియోజకవర్గానికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి ఆ పదవి దక్కకపోవడంతో కొంత కాలంగా పార్టీపై గుర్రుగా ఉన్న వెంకటరెడ్డి ఇటీవల కాలంలో టీపీసీసీలో కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌గా వెంకటరెడ్డిని నియమించడంతో కార్యకలాపాలను వేగవంతం చేశారు. దీంతోపాటు రేవంత్‌రెడ్డితో కలిసి అమెరికా పర్యటన చేయడం, పార్టీ కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్దం కావడంతో ఇప్పుడు ఆయన రాజకీయంగా డోలాయమానంలో పడే పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత పరిణామాలు పెద్ద ఎదురుదెబ్బగా తయారయ్యే పరిస్థితి నెలకొంది. నష్ట నివారణ చర్యల్లో బాగంగా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో చర్చించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా ఒక పార్ములాను తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నికలు అనివార్యమైతే రాజగోపాల్‌రెడ్డికి పోటీగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దించేందుకు సిద్దం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నల్గొండ రాజకీయాల్లో ఓ చరిత్ర కానుంది. అయితే తన సోదరుడిపై పోటీ చేసేందుకు వెంకటరెడ్డి ఓకే అంటారా..? లేక ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే విషయంపై ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది.
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
Munugode News: మూడు పార్టీల వ్యూహంలో మునుగోడు, ఒకరికి మించి మరొకరి వ్యూహాలు - రంగంలోకి అమిత్ షా
Bhadrachalam: భద్రాచలంలో కొనసాగున్న మూడో ప్రమాద హెచ్చరిక, బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ
వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
Koppula Eashwar: సుప్రీంకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కి చుక్కెదురు, 2018 నాటి కేసులో కీలక మలుపు