అన్వేషించండి

కేసీఆర్‌కు మొన్నటిదాకా కమ్యూనిస్టులు తోకపార్టీలు, ఇయాళ ఎందుకు మిత్రులయ్యారు ?: బండి

నిన్నటిదాకా ఇండ్ల కోసం, ఉద్యోగాల కోసం, రైతుల కోసం, ఎస్టీఎస్సీ సమస్యలపై కమ్యూనిస్టు కార్యకర్తలు కొట్లాడినరు... మరి ఇయాళ అవన్నీ వచ్చినయా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

BJP MP Bandi Sanjay Questions Communist Parties over Friendship with TRS: మొన్నటి దాకా కమ్యూనిస్టులను తోకపార్టీలు, సూది దబ్బడం పార్టీలన్న సీఎం కేసీఆర్ ఈరోజు వాటిని ప్రగతి శీల శక్తులని చెబుతుండు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు వేదనకు గురైతున్నరని, కమ్యూనిస్టు సిద్దాంతాలను కేసీఆర్ కాళ్ల ముందు పెట్టారని వ్యాఖ్యానించారు. నిన్నటిదాకా ఇండ్ల కోసం, ఉద్యోగాల కోసం, రైతుల కోసం, ఎస్టీఎస్సీ సమస్యలపై కమ్యూనిస్టు కార్యకర్తలు కొట్లాడినరు... మరి ఇయాళ అవన్నీ వచ్చినయా? మరి దేని కోసం టీఆర్ఎస్ కు మద్దుతు ఎందుకు ఇస్తున్నరు? ఎన్ని వేల కోట్లు ముట్టజెప్పితే మద్దతు తెలిపారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కమ్యూనిస్టు కార్యకర్తల పరిస్తితి ఏంది? 
నిన్నటి దాకా కమ్యూనిస్టులు టీఆర్ఎస్ ను శత్రువుగా చూసి... ఇయాళ ఎందుకు మిత్రుడు అయ్యారు? నిన్నటిదాకా పోరాటాలు చేసిన కేసులపాలైన కమ్యూనిస్టు కార్యకర్తల పరిస్తితి ఏంది?  అందుకే కమ్యూనిస్టు కార్యకర్తలు ఈసారి టీఆర్ఎస్ కు ఓటేయబోమని చెబుతున్నరో ప్రజలకు వివరించాలన్నారు. పొరపాటున టీఆర్ఎస్ కు కమ్యూనిస్టులు ఓట్లేస్తే... ప్రజలు నిలదీస్తారు. రుణమాఫీ కాలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు? ఉద్యోగాలియ్యలేదు... ఎందుకు మద్దతిచ్చారని నిలదీస్తారని, అప్పుడు కమ్యూనిస్టు జెండాలు వెలిసిపోతాయన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలు ఇద్దరు అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీ అని... ఆ ఇద్దరిలో ఎవరు బెటరో బేరీజు వేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎట్లాంటోడో... స్ర్కిప్ట్ రాసిస్తే తప్ప మాట్లాడలేనోడు అని మునుగోడు ఓటర్లు గుర్తుంచుకోవాలని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నడు ఇన్నాళ్లు... ఇగ దేశం మీద పడి దోచుకుంటడ... మునుగోడు ఫలితాలు బీఆర్ఎస్ కు పునాది రాయి అయితదని కేసీఆర్ అంటున్నడు.. కానీ మునుగోడు ఫలితాలే బీఆర్ఎస్ కు సమాధి రాయి కాబోతోందన్నారు.
యాదాద్రి వెళ్లి ప్రమాణం చేసే దమ్ముందా ?
ఎవరైనా తప్పు చేసినోడు తడిబట్టలతో యాదాద్రి వెళ్లి ప్రమాణం చేసే దమ్ముందా?. మా నిజాయితీని నిరూపించుకోవడానికే తడిబట్టలతో ప్రమాణం చేసినం. కానీ సీఎం కేసీఆర్ కు ఆ నిజాయితీ లేదు. కుట్రలు చేస్తావు కాబట్టే ప్రమాణం చేయడానిక రాలేదన్నారు బండి సంజయ్. కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టే.. సీబీఐ ఎంక్వేరీకి కూడా ఒప్పుకోవడం లేదన్నారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా పారిపోయిన వ్యక్తి కేసీఆర్ అని.. టీఆర్ఎస్ కు టీఎన్జీవో నాయకులు మద్దతివ్వడం సిగ్గుచేటు అన్నారు. ప్రమోషన్ల కోసం, పైరవీల కోసం సిగ్గులేకుండా ఆ నాయకులు మద్దతిస్తున్నరని, ఉద్యోగాలకు జీతాలే ఇయ్యనందుకు మద్దతు చెబుతున్నరా? 317 జీవో పేరుతో చెట్టుకొకరు పుట్టకొకరిని చేసినందుకా? అని టీఎన్జీవో నాయకులను ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్నందుకు మద్దతు తెలుపుతున్నరా?. టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన ఆ కొందరు టీఎన్జీవో నాయకులపై కేసులు పెట్టాలని అభిప్రాయపడ్డారు.

Also Read: Bandi Sanjay: సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఆ ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట: బండి సంజయ్ ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget