అన్వేషించండి

Bandi Sanjay: సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఆ ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట: బండి సంజయ్ ఫైర్

టోపీ పెట్టుకని వచ్చి గప్పాలు కొట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టి పోయారని, మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ పారిపోయారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్/ బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు. టోపీ పెట్టుకని వచ్చి గప్పాలు కొట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టి పోయారన్నారు. మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికలు అయిపోగానే మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారని బండి వ్యాఖ్యానించారు. వంద కోట్లు పెట్టి ఆ ఎమ్మెల్యేలను కొంటారట.. వాళ్లు ఆణిముత్యాలట. వాళ్లంతా సెకండ్ హ్యాండ్ గాళ్లు.. ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయినోళ్లు... అసలా ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా ఎందుకు వదిలేయడం లేదో ప్రజలకు చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు.

మునుగోడు ప్రజలు గాడిదలెవరో, ఆవు ఎవరో నిర్ణయించుకున్నారని.. గాడిదలాంటి టీఆర్ఎస్ కు ఓటేయబోరన్నారు. టీఎన్జీవో నేతలు కొందరు టీఆర్ఎస్ కు మద్దతివ్వడంపట్ల బండి సంజయ్ మండిపడ్డారు.. ‘‘ఉద్యోగులను ఏం ఉద్దరించారని మద్దతు తెలుపుతున్నారు? 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరని చేసినందుకా? జీతాలే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకా?‘’అంటూ ప్రశ్నించారు.  మర్రిగూడలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జె.సంగప్ప, ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్న కేసీఆర్.... వ్యాట్ పేరుతో లీటర్ పెట్రోలుపై రూ.30లు ఎందుకు దొబ్బుతున్నారు. వ్యాట్ పేరుతో ఏటా రూ.10 వేల కోట్లు ఎందుకు దోచుకుంటున్నవ్? నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఎందుకు తగ్గించవు? అని ప్రశ్నించారు బండి సంజయ్.
బండి సంజయ్ ప్రస్తావించిన అంశాలివే..
 -  ‘ఈరోజు కేసీఆర్ మళ్లీ కోతలు కోసిండు.... మునుగోడు ఎన్నికలున్నందున నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పమని అడిగనం... కానీ ఆ ఊసే ఎత్తలేదు. గతంలో ఇచ్చిన హామీలతోపాటు మొన్న ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు. గౌడ కులస్తుల గురించి ప్రస్తావనే లేదు. బెల్టు షాపులు పెట్టి, డ్రంకన్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ల వ్రుత్తులు దెబ్బతీస్తావేమో... యాదవుల సమస్యలు మాట్లాడలేదు.. అంటే మొన్న అకౌంట్లో వేసిన గొర్ల పథకం పైసలు వాపస్ తీసుకుంటాడేమో.. వడ్డెరలు, విశ్వకర్మలు, ఎస్టీ, ఎస్టీల ప్రస్తావనే లేదు. కుమ్మరి, కమ్మరి సహా ఎవరి గురించి ప్రస్తావించలే. అంటే ఆ కులాలకు ఏమీ చేయనని చెప్పేసిండు.. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నడు.. 

-  చేనేతల గురించి ప్రస్తావించిన కేసీఆర్... చేనేత సహకార ఎన్నికలు ఎందుకు జరపడం లేదు. నూలు వస్త్రాల రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైంది? చేనేత బంధు ఎంతమందికి ఇచ్చిండో చెప్పలేదు. జీఎస్టీ గురించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు? జీఎస్టీ వేయాలని మంత్రి హరీష్ రావు చెప్పిన విషయం మర్చిపోయినవా?
-  శివన్నగూడెం, రోడ్లన్నీ చిన్న చిన్నపనులట... 15 రోజుల్లో గెలిపిస్తారట... అంత చిన్నవైతే 8 ఏళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదు. అన్నీ అబద్దాలే... చివరకు ‘‘సూడు సూడు నల్లగొండ... గుండెపైన ఫ్లోరైడ్ బండ’’ నేనే రాసినని సిగ్గు లేకుండా కేసీఆర్ చెప్పుకుండు.. ఆ పాట రాసింది కోదాటి శ్రీను... అయినా సిగ్గు, శరం లేకుండా నేనే రాసినని అబద్దాలు చెప్పిండు..
-  మరి డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఎందుకు ఇయ్యలే? ఉద్యోగాలెందుకు ఇయ్యలే. ఈడ ఉద్యోగాలు రాక వేలాదిమంది యువత డ్రైవర్లుగా హైదరాబాద్ వలసపోయిండ్రు.
-  శివన్నగూడెం రిజర్వాయర్ పనులను కేంద్రం ఆపిందని పచ్చి అబద్దాలు వల్లించిండు... ఇప్పుడేమో 15 రోజుల్లో పూర్తి చేస్తానని కథలు చెబుతున్నడు. కిష్టరాంపల్లి, డిండి ప్రాజెక్టులు ఏమైనయ్... పాలమూరు-రంగారెడ్డి ఏమైంది? 
-  ఫ్లోరైడ్ సమస్యపైనా అబద్దాలు చెప్పిండు... క్రిష్ణా జలాలను హైదరాబాద్ తీసుకుపోయే సమయంలో మునుగోడు సహా ఫ్లోరోసిస్ ప్రాంతాలకు తెలంగాణ రాకముందే నీళ్లు వచ్చినయ్..
-  నువ్వు ఇంఛార్జ్ గా ఉన్న లెంకలపల్లి గ్రామ ప్రజలంతా ఆర్వో ప్లాంట్ ద్వారా నీళ్లు తాగుతున్నరు. మరి నీ మిషన్ భగీరథ నీళ్లు యాడికి పోయినయ్...
-  కేసీఆర్... ఈ సారైనా హామీలన్నీ అమలు చేస్తారేమో.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానంటాడేమో అనుకున్న... టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రజల్లో ఉంటాడట... అసలాయన అందుబాటులోనే ఉండరు. ఆయన ప్రజల్లో ఉంటే ఓట్లు కూడా పడవు.. ఆయన వస్తుంటేనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకునే దుస్థితి.
-  ఈరోజు కేసీఆర్ టోపీ పెట్టుకుని వచ్చిండు.. ప్రజలకు టోపీ పెట్టి పోయిండు. ఇన్నాళ్లు 4గురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లో గంప కింద కోడిలాగా కప్పిపెట్టిండు... యాడ పారిపోతరో.. నిజాలు ఎక్కడ బయటపడతాయోనని... సర్కస్ లో, జూలో జంతువులను పట్టుకొచ్చినట్లుగా ఇయాళ సభకు తీసుకొచ్చి మళ్లీ వెంట బెట్టుకుపోయిండు..
ఆ ఎమ్మె్ల్యేలు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయినోళ్లు..
-  వంద కోట్లు పెట్టి ఆ ఎమ్మెల్యేలను కొంటారట.. వాళ్లు ఆణిముత్యాలట... వాళ్లంతా సెకండ్ హ్యాండ్ గాళ్లు... ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయినోళ్లు... అసలా ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా ఎందుకు వదిలేయడం లేదు? 
-  సీబీఐ విచారణ జరగకుండా 51 జీవో ఎందుకు తీసుకొచ్చినవ్? అంత భయమెందుకు? తప్పు చేయకుంటే విచారణ జరిపించాలి కదా....
-  గత 8 ఏండ్లలో 36 కాదు.. 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువు లెక్క కొన్నది నువ్వు. ప్రతి ఏటా వడ్లు కొనేది ముమ్మాటికీ కేంద్రమే. పైసలిచ్చేది కేంద్రమే... కేసీఆర్ మాత్రం సంతలో పశువుల లెక్క ఎమ్మెల్యేలను కొంటున్నడు..
-  వడ్లు కేంద్రం కొనడం లేదు... కేంద్రం పైసలియ్యడం లేదని దమ్ముంటే ప్రమాణం చెయ్...మోటార్లకు మీటర్లట.. యాడ పెట్టినం? దుబ్బాకలో, హుజూరాబాద్ లో పెట్టినమా? మేం గెలిచిన చోట ఏమైనా పెట్టినమా? 
-  మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికల తరువాత కరెంట్ ఛార్జీలను కేసీఆర్ మళ్లీ పెంచబోతున్నడు. ఎందుకంటే 70 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలున్నయ్. జీతాలిచ్చే పరిస్థితి లేదు. వాటికి కారణం ముమ్మాటికీ కేసీఆరే... 
-  24 గంటలు కరెంట్ ఇస్తున్ననని గప్పాలు కొడుతుండు.. ఈరోజు మర్రిగూడలో 10 సార్లు కరెంట్ కట్ అయ్యింది. అయినా పచ్చి అబద్దాలు వల్లిస్తుండు..
-  బిడ్డ లిక్కర్ కేసు.. కొడుకు డ్రగ్స్ కేసు... టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిండ్రు... మంత్రుల ఉంటారో ఉండరో నిత్యం అనుమానమే... సీఎం సీటు కోసం నిత్యం ఇంట్ల గోడవ... ఇవన్నీ దారి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామాలు..
-  గాడిదకు గడ్డి వేసి బర్రె పాలియ్యమంటే ఇస్తదా? అన్నవ్ కదా.. అవును.. గాడిద ఎవరో, ఆవు ఎవరో ప్రజలకు తెలిసిపోయింది. మీలాంటి గాడిదలకు ఓటేయబోమని మునుగోడు ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget