అన్వేషించండి

KA Paul: పోలింగ్ బూత్‌ల వద్ద కేఏ పాల్ ఉరుకులు, ఆయన సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే!

మునుగోడు నియోజకవర్గం పరిధిలో తాను 100 పోలింగ్ బూత్ లను చుట్టి రావాలని అందుకే టైం సరిపోదు కాబట్టి, వేగంగా వెళ్తున్నానని చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆయన ఎన్నికల ప్రచారం మొదలుకొని కాస్త విభిన్నంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. కేఏ పాల్ ఆత్మవిశ్వాసంతో తానే గెలుస్తానని చెప్పడం, రెండో స్థానంలో నిలిచే పార్టీ ఎవరో చెప్పాలనడం లాంటి వ్యాఖ్యలను చాలా మంది కామెడీగా తీసుకున్నారు. మరోవైపు, ప్రచారంలో రోజుకు ఓ గెటప్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండగా కూడా ఆయన వ్యవహరించిన విధానం అందరినీ నవ్వించింది. ఉదయం నుంచి కేఏ పాల్ తన పది వేళ్లకి పది ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఎన్నికల సంఘం ఉంగరం గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. అందుకే చేతి పది వేళ్లకు పది ఉంగరాలు ధరించి వచ్చారు. ఒక్కో పోలింగ్ బూత్ తిరుగుతూ పరిశీలించారు. ఒక బూత్ నుంచి మరో బూత్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లడం అందరికీ నవ్వు తెప్పించింది. 

పోలింగ్ బూత్‌ల ముందు కేఏ పాల్ పరిగెత్తిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మునుగోడు నియోజకవర్గం పరిధిలో తాను 100 పోలింగ్ బూత్ లను చుట్టి రావాలని అందుకే టైం సరిపోదు కాబట్టి, వేగంగా వెళ్తున్నానని చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఆ ప్రశ్నకు సమాధానం మరీ కామెడీగా

పది వేళ్లకు పది ఉంగరాలు ధరించి వచ్చిన కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతుండగా విలేకరులు ఆయన్ను ఓ ప్రశ్న అడిగారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆయనకు కేటాయించిన గుర్తును అలా ప్రదర్శిస్తుండడం నేరం కదా అని అడిగారు. దానికి కేఏ పాల్ చెప్పిన సమాధానం మరింత ఫన్నీగా ఉంది. ‘‘టీఆర్ఎస్ పార్టీది కారు గుర్తు. వారు 30 వేల కార్లలో వచ్చారు. మరి అది కూడా ఎన్నికల నిబంధన ఉల్లంఘించినట్లే కదా? అలా అయితే వాళ్లంతా బైక్ లపైన రావాలి’’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను అందరూ వైరల్ చేస్తున్నారు. వాట్సప్‌లలో స్టేటస్ పెట్టుకుంటున్నారు.

సంస్థానారాయణ పూర్‌లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా పోలింగ్ బూత్‌ల లోపలకు వెళ్లారని కేఏ పాల్ అన్నారు. దాంతో పోలీసులు సహకారంతో కేఏ పాల్ వాళ్లను బయటకు పంపించానని చెప్పారు. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పాల్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు ఇక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఒక్కో ఓటరుకు రూ.30 వేలు ఇస్తానని చెప్పి రూ.3 వేలు ఇచ్చిందని విమర్శించారు. టీఆర్ఎస్ తులం బంగారం, రూ.30 వేలు ఇస్తామని చెప్పి రూ. 3 వేలు ఇచ్చిందని అన్నారు. అలాంటి వీరిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

వారివద్ద రూ.కోట్లలో డబ్బులు దొరికినా ఆ అభ్యర్థులను ఎందుకు డిస్ క్వాలిఫై చేయడంలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయాలని, ఆయా పార్టీల ఏజెంట్లను బయటకు పంపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు ఈ నెల 6వ తేదీనే తెలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి రావాలని కేఏ పాల్ పిలుపు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget