అన్వేషించండి

Panthangi Toll Plaza: సంక్రాంతి ఎఫెక్ట్.. విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్..

Panthangi Toll Plaza Traffic Updates: సొంతూళ్లకు పయనం కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్​ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కిటకిటలాడుతున్నాయి.

Traffic AT Panthangi Toll Plaza: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా పండుగ దగ్గర పడుతున్న కొద్దీ తమ సొంతూళ్లకు చకా చకా వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఏడాది ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది.

జనం పల్లెబాట పడుటుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్​ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగా.. విద్యార్థులు, ఉద్యోగులకు పండుగ సెలవులు రానే వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఏపీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం కావడంతో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాదాపు 50 శాతం వరకు బస్సు టికెట్ ఛార్జీలు పెంచగా.. తెలంగాణ సర్కార్ మాత్రం అలాంటి పని చేయడం లేదని స్పష్టత వచ్చింది.

ఇదివరకే కొందరు తమ సొంతూళ్లకు వెళ్లిపోగా.. నేటి సాయంత్రం ట్రాఫిక్ మరింత అధికం కానుంది. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటల కొద్ది వాహనాలు బారులు తీరే అవకాశం కనిపిస్తోంది. ఫాస్టాగ్ వంటి డిజిటల్ విధానం ద్వారా ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గనుంది. మరోవైపు అదే తీరుగా ప్రజలు తమ సొంత వాహనాలలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత వాహనాలు ఓ వైపు పెరుగుతున్నా.. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ సైతం సంక్రాంతి పండుగ సీజన్లలో మంచి కలెక్షన్లు రాబట్టుకుంటున్నాయి.

సాధారణ సమయం కంటే పండుగ పూట ప్రత్యేకంగా అదనపు సర్వీసులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నడుపుతాయి. పగటిపూట ట్రాఫిక్ సమస్య కాస్త తక్కువగా ఉన్నా, రాత్రి వేళ మాత్రం వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతాయి. ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద రాకపోకలు సాఫీగా సాగితే పంతంగి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. 

 Also Read: MP Raghurama: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. Hydలోని ఇంటి ఎదుట హడావుడి

Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి! 

Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం

Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Lokesh Kanagaraj: 40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్... పుకార్లకు చెక్ పెట్టిన కూలీ దర్శకుడు లోకేష్
40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్... పుకార్లకు చెక్ పెట్టిన కూలీ దర్శకుడు లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Lokesh Kanagaraj: 40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్... పుకార్లకు చెక్ పెట్టిన కూలీ దర్శకుడు లోకేష్
40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్... పుకార్లకు చెక్ పెట్టిన కూలీ దర్శకుడు లోకేష్
Israeli: మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
Devara 2: ‘దేవర‘ పార్ట్ 2 ఎలా ఉంటుందంటే? అసలు విషయం చెప్పేసిన ఎన్టీఆర్
‘దేవర‘ పార్ట్ 2 ఎలా ఉంటుందంటే? అసలు విషయం చెప్పేసిన ఎన్టీఆర్
Swiggy Bolt: స్విగ్గీ నుంచి 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివెరీ, హైదరాబాద్‌లో కొత్త సర్వీస్‌
స్విగ్గీ నుంచి 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివెరీ, హైదరాబాద్‌లో కొత్త సర్వీస్‌
Actor Rajendra Prasad Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Embed widget