By: ABP Desam | Updated at : 12 Jan 2022 12:10 PM (IST)
రఘురామకృష్ణ రాజు (ఫైల్ ఫోటో)
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నేడు (డిసెంబరు 12) హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద హడావుడి నెలకొంది. రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. విచారణకు రావాలని రఘురామకు ఈ నోటీసులు ఇవ్వాలని వచ్చినట్లు తెలుస్తోంది. రేపే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, రేపు నరసాపురం వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ఇప్పటికే ప్రకటించారు. రెండు రోజులపాటు తన సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటిస్తానని రఘురామ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను తన ఊరిలోనే జరుపుకుంటానని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో రఘురామరాజుకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన విషయం సంచలనం రేపింది. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ గతంలో రఘురామపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులోనే విచారణకు రావాలని ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad: ఎర్రగడ్డ సంతలో కత్తులు కొని మాజీ భార్యపై ఘాతుకం.. నడిరోడ్డుపైనే కత్తిపోట్లు
అయితే, రఘురామ బయటకు రాకపోవడంతో సీఐడీ అధికారులు ఇంటి బయట వేచి ఉన్నారు. విచారణకు హాజరు కావాలని.. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నప్పటికీ ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నరన్న విషయంపై వారు స్పష్టంగా చెప్పడం లేదు. కాగా, ఎంపీ రఘురామను అరెస్టు చేయద్దని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం.. ఇప్పుడు ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం లేదు.
ఆ అధికారి ఓ ఉన్మాది: స్పందించిన రఘురామ
ఇన్ని రోజులు ఆ కేసు గురించి పట్టించుకోకుండా పండుగ రోజుల్లో విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం ఏమిటని రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వంపై కుట్ర పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఏపీసీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి రాజద్రోహం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఆ తర్వాత ఎప్పుడూ విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇవ్వలేదు. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి నలుగురు సీఐడీ అధికారుల బృందం వచ్చి.. గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇవాళ నోటీసులు ఇచ్చి.. రేపే విచారణ కావాలని హాజరు కావాలని అడగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో 17వ తేదీన విచారణకు రావాలని చెప్పారని రఘురామకృష్ణరాజు మీడియాకు చెప్పారు. సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని అని మండిపడ్డారు.
Also Read: Minister Perni Nani: మీకు సినిమా తప్ప వేరే యావ లేదా.. మంత్రి పేర్ని నాని అసహనం
Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!
Vikarabad News : 48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?
DK Aruna On BJP Meeting : సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లికి బేడీలు వేశారు, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి - డీకే అరుణ
Cyber Crime: తెలంగాణ డీజీపీ పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్‌లు- సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
Revanth Reddy: నాలుగేళ్ల సర్వీస్ తర్వాత కార్పొరేట్ సంస్థలకు కాపు కాయాలా? అగ్నిపథ్‌పై రేవంత్ విమర్శలు
Ms & Mrs Telangana Divas : హైదరాబాద్ లో మిస్ అండ్ మిస్సెస్ తెలంగాణ దివాస్ బ్యూటీ కాంటెస్ట్ , విజేతలు వీరే!
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ