అన్వేషించండి

Jagruthi Kavitha: గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు

Kavitha: హరీష్, రేవంత్ కలిసి నాటకాలు ఆడుతున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. అధికారంలోకి వస్తే అమరవీరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Kalvakuntla Kavitha criticized Harish and Revanth: మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆడుతున్నారని కవిత తీవ్రంగా విమర్శించారు. పట్టణాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని, బాధితులకు ఈ విచారణల ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వస్తే అమరవీరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహణ
 
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కూడా ట్యాంక్ బండ్ పై మన తెలంగాణ వారి విగ్రహాలు లేవు.  ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయమనటం లేదు. అవసరమైన నాడు తప్పకుండా తీసేద్దాం.  కానీ మన తెలంగాణ వారి విగ్రహాలు కచ్చితంగా ట్యాంక్ బండ్ పై ఉండాలన్నారు.   తెలంగాణ కోసం పోరాడిన ఎందరో అన్‌సంగ్ హీరోల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, తాము అధికారంలోకి వస్తే అమరవీరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.          

బీసీ రిజర్వేషన్లపై త్వరలో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం         

రాష్ట్రంలో జరిగిన కులగణనలో బీసీల సంఖ్యను తక్కువగా చూపి కాంగ్రెస్ మోసానికి పాల్పడిందని, కేంద్రం చేపట్టబోయే కులగణన ద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని కవిత పేర్కొన్నారు. బీసీ ఉపకులాలకు అన్యాయం జరగకుండా ప్రతి కులానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలంగాణ జాగృతి సేకరిస్తుందని, దీనిపై త్వరలోనే మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు యువత రాజకీయాల్లోకి రావాలని, వారికి జాగృతి తరపున పూర్తి మద్దతు ఇస్తామని ఆమె పిలుపునిచ్చారు. 

సికింద్రాబాద్ జిల్లా డిమాండ్  చేస్తున్న కేటీఆర్ పై కవిత సెటైర్లు                           

సికింద్రాబాద్ జిల్లా  ఏర్పాటు డిమాండ్‌పై స్పందిస్తూ, గత పదేళ్లుగా ఈ డిమాండ్‌ను అణిచివేసిన కేటీఆర్, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయడంతో పాటు,  ప్రొఫెసర్ జయశంకర్  గారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఇంకా పూర్తిస్థాయిలో అవతరించకపోయినప్పటికీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే వారికి అండగా ఉంటామని కవిత స్పష్టం చేశారు.                       

టాప్ హెడ్ లైన్స్

Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Kalvakuntla Kavitha : తెలంగాణ రక్షణ సేన తొలి శంఖారావం - ఎమ్మెల్సీ బరిలో కవిత పార్టీ.. బిఆర్ఎస్‌ను దాటేస్తారా?
తెలంగాణ రక్షణ సేన తొలి శంఖారావం - ఎమ్మెల్సీ బరిలో కవిత పార్టీ.. బిఆర్ఎస్‌ను దాటేస్తారా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget